Home / ANDHRAPRADESH / ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్న మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ స‌ర్వే.. #జ‌న‌సేన‌కి..? #టీడీపీకి..? #వైసీపీకి..?

ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్న మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ స‌ర్వే.. #జ‌న‌సేన‌కి..? #టీడీపీకి..? #వైసీపీకి..?

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. కేంద్రం తాజాగా ఏపీకి కేటాయించిన బ‌డ్జెట్ పై వ్య‌తిరేకంగా గురువారం వామ‌ప‌క్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇక వైసీపీ కూడా బంద్‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా త‌న పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇవ్వ‌నున్నారు. ఇక అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నిక‌ల వేళ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో వ‌రుసగా స‌ర్వే రిపోర్టులు ద‌ర్శ‌న మిస్తున్నాయి. మొద‌ట బీజేపీ అనుకూల జాతీయ‌మీడియా స‌ర్వే బ‌య‌ట‌కి వ‌చ్చి హాల్ చ‌ల్ చేయ‌గా.. వెంటనే ఏపీ ఆక్టోప‌స్ స‌ర్వేల స్పెష‌లిస్ట్ ల‌గ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే రిపోర్ట్ లీక్ అయ్యి ర‌చ్చ ర‌చ్చ చేసింది.

ఇక ఆ త‌ర్వాత రాహుల్ స‌ర్వే అంటూ మ‌రో స‌ర్వే చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే ఇక్క‌డ అస‌లు సిస‌లైన కామ‌న్ పాయింట్ ఏంటంటే.. ఆ మూడు స‌ర్వేల్లో అధికార టీడీపీ త‌న అధికారాన్ని కోల్పోగా.. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ చ‌రిత్ర తిర‌గ‌రాస్తూ అధికారాన్ని కైవశం చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని తేల్చేశాయి. అయితే ఈ స‌ర్వేల‌ రిజ‌ల్ట్‌లే రేపు ఎన్నిక‌ల్లో రిపీట్ అవ‌డం ఖాయ‌మ‌ని కొంత‌మంది విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ‌గా.. టీడీపీ వ‌ర్గీయులు మాత్రం అవి ఫేక్ సర్వేల‌ని.. కేక‌లు వేస్తున్నారు. అయితే ఈ నేప‌ధ్యంలో మ‌రో స‌ర్వే రిపోర్టు ఒక‌టి బ‌య‌ట‌కి వ‌చ్చి రాజ‌కీయ వ‌ర్గాల్ని కుదిపేస్తోంది. మ‌రి ఈ తాజా స‌ర్వే పై కూడా ఓ లుక్ వేద్దామా..

అయితే ఈసారి స‌ర్వే ఎవ‌రు చేశారనుకుంటున్నారా.. ఈ కాలంలో రీల్ లైఫ్‌లో కాకుండా.. రియ‌ల్ లైఫ్‌లో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌లు ఎవ‌రు ఉంటారు.. అందులోనూ రాజ‌కీయ నాయ‌కుల్లో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌లు ఎవ‌రో.. ఈ స‌ర్వేలు ఏంట‌ని ఖంగారు ప‌డ‌కండి.. ప్ర‌స్త‌త రాజ‌నీతిలో ఓట‌రే మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌.. మ‌రి ఈ స‌ర్వే ఏంటి అంటారా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయాక.. ఏపీలో జ‌రిగిన గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో.. టీడీపీ.. ఒక‌వైపు బీజేపీ+జ‌న‌సేన‌ను అడ్డం పెట్టుకొని.. మ‌రోవైపు అనేక హామీల‌తో అధికారంలోకి వ‌చ్చింది. రాష్ట్రం విడిపోయాక అనుభ‌వం ఉన్న‌వాడు ముఖ్య‌మంత్రి అయితే ఎంతో కొంత మేలు జ‌రుగుతోంద‌ని ప్ర‌జ‌లు భావించి చంద్ర‌బాబుకు అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. అయితే చంద్ర‌బాబు త‌న ప‌చ్చ‌సేన‌ల‌తో అస‌లే లోటులో ఉన్న రాష్ట్రాన్ని దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకొని ప్ర‌జ‌ల్ని విస్మ‌రించారు. ఈ నేప‌ధ్యంలో టీడీపీ పై తీవ్ర‌వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల్లో పెరిగిపోయింది. ఇక‌ న‌మ్మి అధికారంలో కూర్చోబెట్టిన ప్ర‌జ‌ల్ని నానా క‌ష్టాల‌కు గురిచేసి వారి క‌న్నీళ్లే మిగిల్చిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వానిక జ‌నం మ‌ళ్ళీ ఓట్లు వేస్తారా…

ఇక జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే.. పార్టీ పెట్టి చానా ఏళ్లే అయినా ఇప్పుటికీ తాడుబొంగ‌రం లేకుండా..టీడీపీ తొత్తు పార్టీగానే ఉంది.. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయితే చంద్ర‌బాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. దీంతో జ‌న‌సేనాని పార్ట్ టైమ్ పాలిటిక్స్‌పై జ‌నంకు అసలు న‌మ్మ‌క‌మేలేదు. గ‌తంలో అన్నయ్య‌ చిరంజీవి పార్టీకైనా కొన్ని సీట్లు వ‌చ్చాయ్.. ఈసారి జ‌న‌సేన ఒంట‌రిగా బ‌రిలోకి దిగితే మాత్రం.. ఒక్క‌టంటే ఒక్క సీటుకూడా గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని ఒట‌ర్లు తేల్చేస్తున్నారు. ఇక కేంద్ర‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఎప్ప‌టి నుండో టీడీపీకి మిత్ర ప‌క్షంగా ఉంది.. ఇటీవ‌ల ఈ రెండు పార్టీల మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిన నేప‌ధ్యంలో బీజేపీ కూడా ఒంట‌రిగా బ‌రిలోకి దిగే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఈసారి టీడీపీతో పాటు ఎన్నిక‌ల్లోకి వెళితే.. ప‌రువుపోవ‌డం ఖాయ‌మ‌ని బీజేపీ అధిష్టానం అభిప్రాయ‌ప‌డుతోంది. అయితే బీజేపీ ఒంట‌రిగా వ‌చ్చినా, టీడీపీతో క‌లిసి వ‌చ్చినా.. ఏపీ ఓట‌ర్ల దృష్టిలో మాత్రం ప‌డే ఛాన్స్ లేద‌ని తేలింది.

ఇక చివ‌రిగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ..విష‌యానికి వ‌స్తే గ‌త ఎన్నిక‌ల్లోనే కొద్దిలో అధికారాన్ని కొల్పోయి ప్ర‌తిప‌క్షంలో కూర్చున వైసీపీకి ఈ ఎన్నిక‌లు చావో రేవో అని చెప్పాలి. దీంతో రాష్ట‌మంతా వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌తో జ‌నాల్లోకి వెళ్ళి ప్ర‌జ‌ల క‌ష్టాన్ని ద‌గ్గ‌ర‌గా చూసి.. వారి స‌మ‌స్య‌ల‌నే హామీల‌గా ప్ర‌క‌టిస్తూ.. వారి క‌న్నీళ్లు తుడిచేందుకు హామీల వ‌ర్షం కురిపిస్తూ.. ప‌క్కాగా ప్ర‌ణళిక‌ల‌తో ముందుకువెళుతున్నారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీలు జ‌నాల్లోకి బాగా చొచ్చుకుపోయి జ‌గ‌న్ పాద‌యాత్రిక జ‌నం మాత్రం వేలల్లో వ‌స్తున్నారు. అయితే జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి జ‌నం వేల‌ల్లో త‌ర‌లి వ‌చ్చినంత మాత్రానా.. రేపు ఓట్లు వేస్తారా అనే ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. జ‌నం స‌మ‌స్య‌లు ప‌ట్టించుకుని.. ప్ర‌జ‌ల్లో క‌లిసిపోయే నాయ‌కుల‌కే ఈసారి ఓటు ప‌డ‌డం ఖాయ‌మ‌ని.. ఏపీలో ఉన్న‌ మొత్తం 13 జిల్లాల్లో రానున్న ఎన్నిక‌ల్లో ఒకే గాలి వీయ‌నుంద‌ని.. గ్రామ‌స్థాయి నుండి ఈసారి ప‌క్కాగా.. ఓటింగ్ జ‌ర‌గ‌నుంద‌ని.. మ‌రి ఆ ఓట‌ర్ మ‌న‌సు గెలుచుకున్నే స‌త్తా ప్ర‌స్తుతం ఏ పార్టీకి ఉందో మీరే నిర్ణ‌యించుకోండ‌ని మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ సర్వే సవాల్ విసురుతోంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat