రాజ్యసభలో ఎంపీ రేణుక చౌదరికి ప్రధాని మోదీ అదిరిపోయే పంచ్.. – Dharuvu
Breaking News
Home / NATIONAL / రాజ్యసభలో ఎంపీ రేణుక చౌదరికి ప్రధాని మోదీ అదిరిపోయే పంచ్..

రాజ్యసభలో ఎంపీ రేణుక చౌదరికి ప్రధాని మోదీ అదిరిపోయే పంచ్..

రాజ్యసభలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు అయిన రేణుక చౌదరికి అదిరిపోయే పంచ్ వేశారు .బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రధాని మోదీ మాట్లాడారు .అయితే ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నాలు చేశారు .

ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు .దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండనక్కర్లేదని చెప్పారని ఆయన అన్నారు .కాంగ్రెస్ లేని భారత్ అనేది తన నినాదం కాదని అది మహాత్మా గాంధీనే చెప్పారు అని ఆయన అన్నారు.దీంతో ఎంపీ రేణుక చౌదరి ఒక్కసారిగా బిగ్గరగా నవ్వారు .

దీంతో ప్రధాని మోదీ రేణుక చౌదరి నవ్వుపై స్పందిస్తూ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటె వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చూయించుకోవాలి .లేకపోతే ఆరోగ్యం పాడవుతుందని ఆయన సెటైర్ వేశారు .అంతే కాకుండా అప్పట్లో రామాయణంలో ఇలాంటి నవ్వులే విన్నామని ఇప్పుడు మరోసారి వింటున్నామని ఆయన అన్నారు .