మంథని నియోజకవర్గ ప్రజల మదిలో చెరగని ముద్రవేసుకుంటున్న పుట్ట మధు – Dharuvu
Breaking News
Home / POLITICS / మంథని నియోజకవర్గ ప్రజల మదిలో చెరగని ముద్రవేసుకుంటున్న పుట్ట మధు

మంథని నియోజకవర్గ ప్రజల మదిలో చెరగని ముద్రవేసుకుంటున్న పుట్ట మధు

తెలంగాణ రాష్ట్రంలో మంథని అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడి పంతొమ్మిది ఏండ్లు అవుతున్న సంగతి తెల్సిందే.అయితే ఉమ్మడి రాష్ట్రంలో మంథని అసెంబ్లీ నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకు సేవ చేయకుండా ..సమస్య అని తన దగ్గరకు వస్తే పరిష్కరించకుండా తన అనుచవర్గంతో పలు దందాలను అక్రమాలను చేయించేవాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించడం మనం చూస్తూనే ఉన్నాం.కానీ ఎన్నో ఉద్యమాలు ..పోరాటాల తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన పుట్ట మధు గత నాలుగు ఏండ్లుగా పెన్షన్ల దగ్గర నుండి నిరుద్యోగ యువతకు ఉపాధి వరకు,రైతు రుణ మాఫీ దగ్గర నుండి డ్వాక్రా గ్రూపు మహిళలకు రుణాలు ఇలా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలందరికీ దగ్గరగా ఉంటూ అందరి మన్నలను పొందుతున్నారు.ఈ క్రమంలో మన ఊరు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమంతో నియోజక వర్గ వ్యాప్తంగా పర్యటించి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే అక్కడిక్కడే పరిష్కరించి పదిహేను ఏండ్లు పాటు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ బాబు చేయలేని పనులను పుట్ట మధు చేస్తూ తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేస్తున్నారు పుట్ట మధు.