కొండ చిలువ, నాగుపాము భీకరమైన కొట్లాట…సోషల్ మీడియాలో తెగ వైరల్ – Dharuvu
Breaking News
Home / INTERNATIONAL / కొండ చిలువ, నాగుపాము భీకరమైన కొట్లాట…సోషల్ మీడియాలో తెగ వైరల్

కొండ చిలువ, నాగుపాము భీకరమైన కొట్లాట…సోషల్ మీడియాలో తెగ వైరల్

కొండ చిలువ కంటే బలం తక్కువగా ఉన్నా నాగు పాము విషానికి పవర్ ఎక్కువ. ఇది క‌రిచిందంటే క్ష‌ణాల్లో ప్రాణాలు పోతాయి. అలాంటిది కొండ చిలువ, నాగుపాము కొట్లాటకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొండ చిలువ, నాగుపాము రెండూ భయంకరమైన సర్పాలే. ఒకదానికి బలమెక్కువైతే, మరొకదాని విషం ప్రాణాంతకమైనది. ఈ రెండింటి మధ్య ఏకాంత ప్రదేశంలో ఫైట్ జరిగింది. కొండ చిలువ తన బలంతో నాగుపామును చుట్టి హత మారిస్తే, నాగుపాము తన చివరి క్షణాల్లో వేసిన కాటుకు కొండ చిలువ ప్రాణాలు పోయాయి. ఈ ఫైట్ లో రెండూ ప్రాణాలు కోల్పోయాయి.

ఈ ఫైట్ ఎక్కడ జరిగిందన్నది సరిగ్గా తెలియనప్పటికీ, ఆసియాలోనే జరిగి ఉంటుందని నిపుణుల అంచనా. ఈ ఘటన ఆగ్నేయాసియాలో చోటు చేసుకొని ఉండొచ్చని ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి చెందిన కోలెమన్ షీహీ, నేషనల్ జియోగ్రఫీకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.