రోజూ 3 అరటిపండ్లు తింటే కలిగే లాభాలు ఇవే.? – Dharuvu
Home / LIFE STYLE / రోజూ 3 అరటిపండ్లు తింటే కలిగే లాభాలు ఇవే.?

రోజూ 3 అరటిపండ్లు తింటే కలిగే లాభాలు ఇవే.?

పురాతన కాలం నుండి అరటి పండ్లు మనకు మంచి పోషకాలు ఇచ్చే ఆహారం గానే కాకా వివిధ రకాల రోగాలను నయం చేయడానికి మంచి ఔషధంగా పనిచేస్తున్నాయి.ప్రపంచంలో ఏ క్రీడాకారుడుని తీసుకున్న వారు తినే పండ్లలో మొదటి ప్రాధాన్యత అరటి పండుకే ఇస్తారనటం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే రోజు మూడు అరటిపండ్లు ను తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్పుతున్నారు.దీని వల్ల మన శరీరానికి నిత్యం కావలిసిన మోతాదులో పోటాషియం అందుతుందని పేర్కొంటున్నారు.అయితే నిత్యం మూడు అరటిపండ్లు తినడం వల్ల కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

see also : తుల‌సి ఆకులు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..?

ఉదయం బ్రేక్ ఫాస్ట్,మధ్యాహ్నం  లంచ్ రాత్రి డిన్నర్ సమయంలో ఒక్కొక్క అరటి పండు తీసుకుంటే గుండె జబ్బుల బారిన పడకుండ మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.ఇలా చేయడం వల్ల రక్తం గడ్డకట్టే అవకాసం 21శాతం తగ్గుతుందని అంటున్నారు.ఒక్కొక్క అరటి పండులో దాదాపుగా 500 మిల్లీ గ్రాముల పోటాషియం ఉండటంవల్ల రోజు మూడు అరటిపండ్లు తీ సుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వైద్యులు అంటున్నారు.అదేవిధంగా శరీరంలోని ద్రవాలను కావాల్సిన స్థాయిలో ఉంచేందుకు ,బీపీని తగ్గించేందుకు అరటి పండు అద్భుతంగా పని చేస్తుంది.

see also : రోజూ నెయ్యి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

మనం నిత్యం తినే ఆహారంలో వుండే అత్యధిక లవణాల గాడత కారణంగా ఎముకలు త్వరగా క్షయానికి గురవుతాయి .అయితే అరటి పండ్లు తినడం వల్ల ఎముకలు దృడంగా మారడంతో పాటు ఎముకలసాంద్రత కూడా పెరుగుతుంది.మెదడు సరిగ్గా పనిచేయడం లో సెరటోనిన్ అనే మూలకం కీలక పాత్ర పోషిస్తుంది.మనం తినే అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే పదార్ధం శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది.అంతే కాదు ప్రధానంగా విద్యార్ధులు రోజు ఉదయం తినే అల్పాహారం మరియు మధ్యాహ్నం తినే ఆహారంలో ఒక్క అరటిపండును తింటే తమ జ్ఞాపకశక్తిని వృద్ది చేసుకోవచ్చు.

రక్త హినతను నివారించడంలో అరటిపండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.వీటిలో వుండే ఐరన్ రక్తం హిమోగ్లోబిన్ల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
పిచు పదార్ధానికి నిలువుగా వున్నా అరటిపండ్లు మలబద్దకాన్ని నివారిస్తాయి.ఎటువంటి మందులు వాడకుండానే నిత్యం అరటిపండ్లు తింటే మలబద్దకం దానంతట అదే తగ్గిపోతుంది.

see also : రోజు రెండు యాలుకులుతింటే ఏమవుతుందో తెలుసా..?