Home / ANDHRAPRADESH / ఢిల్లీలో తెలుగోడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తమ్ముళ్ళు ..ప్రతి తెలుగోడు చదవాల్సిన ఆర్టికల్ ..

ఢిల్లీలో తెలుగోడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తమ్ముళ్ళు ..ప్రతి తెలుగోడు చదవాల్సిన ఆర్టికల్ ..

టీడీపీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నేతల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు.నమ్మి ఓట్లేసిన అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు అని వారికి బుద్ధి చెప్పాలనే ..తెలుగోడి పవర్ ఏమిటో అక్కడి వారికీ తెలియజేయాలని పెట్టిన పార్టీ.పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ అని తమ్ముళ్ళు చెప్పే మాట .అట్లాంటి ఘన చరిత్ర ఉన్న టీడీపీ అధ్యక్షుడిగా ,నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చేతిలో టీడీపీ ఎంపీలు కీలుబొమ్మలుగా మారిపోయారా..తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ లో ప్రధాని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారా అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు.అసలు విషయానికి అప్పటి రాష్ట్ర విభజన సమయంలో ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా విశాఖ పట్టణానికి రైల్వే జోన్ ,కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని సాక్షాత్తు చట్టాలు చేసే ..యావత్తు వందకోట్లకు పైగా ఉన్న భారతీయుల తలరాతను నిర్ణయాలు తీసుకునే దేవాలయం లాంటి పార్లమెంటు సాక్షిగా ఐదున్నర కోట్ల ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు.

అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇటు ఏపీలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కాదు ఏకంగా ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది.అయితే అప్పటి ఎన్నికల సమయంలో ఇటు టీడీపీ అటు బీజేపీ పార్టీ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా మమ్మల్ని గెలిపిస్తే ఏపీకి ఐదేండ్లు కాదు పదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రస్తుత ప్రధానమంత్రి నరేందర్ మోదీ ,ఉపరాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.వీరు చెప్పింది నమ్మిన ప్రజలు గెలిపించి అధికారంలో కూర్చోబెట్టారు.తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ఫ్యాకేజీ అంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది టీడీపీ ,బీజేపీ మిత్రపక్షం.ఇటివల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రస్తుత ఎన్డీఏ సర్కారు చిట్ట చివరి బడ్జెట్ .ఈ బడ్జెట్ లో కూడా ఏపీకి నిధులు తక్కువగా కేటాయించడమే కాకుండా అసలు ప్రత్యేక ఫ్యాకేజీ గురించి కానీ రైల్వే జోన్ గురించి కానీ ఆఖరికి కడప ఉక్కు పరిశ్రమ గురించి అసలు ఊసే లేదు.

ఏపీ ప్రజలు కోరుతుంది కొత్త హామీ ఏమి కాదు.విభజన సమయంలో ,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే అడుగుతున్నారు.అయితే చేయడానికి వీలుండి అమలు చేయకుండా మోదీ సర్కారు ఏపీ ప్రజలను మోసంచేస్తుంటే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మిత్రపక్షాలైన బీజేపీ టీడీపీ తమకు ఏమి తెలియనట్లు ఒకరిపై మరొకరు విమర్శల పర్వం కురిపించుకుంటున్నారు.అంతే కాకుండా ఒకపక్క కేంద్రంలో కేంద్రమంత్రులుగా ఉంటూనే మరోవైపు ఎంపీల చేత బడ్జెట్ లో అన్యాయం జరిగిందని ధర్నాలు నిరసనలు చేయిస్తున్నారు చంద్రబాబు.నిజంగా ఏపీ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని ఏపీ టీడీపీ నేతలు భావించి ఉంటె ఎంపీ పదవులకు ,కేంద్రమంత్రి పదవులకు రాజీనామాలు చేసి ధర్నాలు రాస్తోరోకులు చేయాలి.కానీ అలా చేయకుండా ఏపీ ప్రజలను మభ్యపెట్టడానికి ధర్నాలు రాస్తోరోకులు అంటూ కలరింగ్ ఇస్తున్నారు.

ఒకవేళ రాజీనామాలు చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా విభజన సమయంలో ఇచ్చిన హామీలను నేరవేరుస్తారా అని అనుమానం సగటు సామాన్యుడికి రావచ్చు.ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ తరపున పార్లమెంటు లో కోట్లడింది ఇద్దరే ఎంపీలు ..కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటాల వలన ..నాయకత్వ పటిమ వలన అరవై యేండ్లలో కానిది పద్నాలుగు ఏండ్లలో రాష్ట్రాన్ని తెచ్చి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చి తెలంగాణ వాడి పవర్ ఏమిటో ఢిల్లీ నేతలకు చూపించారు.మరి టీడీపీ అంటే తెలుగోడి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పుట్టిన పార్టీ అని చెప్పుకునే తమ్ముళ్ళు తెలుగోడు అత్మగౌరవంగా బ్రతకడానికి సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం కొట్లాడలేరా ..లేక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి చేతిలో కీలు బొమ్మలుగా మారి తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ప్రధాని మోదీ దగ్గర తాకట్టు పెట్టారా అనేది ఇటు ఐదున్నర కోట్ల ఏపీ ప్రజలు అటు తెలుగు తమ్ముళ్ళు ఆలోచించుకోవాలి మరి ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat