Home / TELANGANA / కాళేశ్వరం పనుల వేగాన్ని చూసి ఆశ్చర్యపోయిన 15 వ ఆర్దిక సంఘం

కాళేశ్వరం పనుల వేగాన్ని చూసి ఆశ్చర్యపోయిన 15 వ ఆర్దిక సంఘం

తెలంగాణ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకోసం నిధులు వెచ్చిస్తున తీరు పట్ల కేంద్ర ఫైనాన్స్ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.కాళేశ్వరం పనుల వేగాన్ని చూసి 15 వ ఆర్దిక సంఘం ఆశ్చర్యపోయింది.దేశ చరిత్రలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఒక నమూనా అవుతుందని ఆర్ధిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా వ్యాఖ్యానించారు. ఇంటింటికి స్వచ్చమైన తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పథకం,భారీ సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం దేశంలోని అన్నీ రాష్ట్రాలకు మోడల్ కానున్నట్టు 1 5 వ ఫైనాన్సు కమిషన్ కార్యదర్శి అరవింద్ మెహతా అభిప్రాయపడ్డారు.రైతులకు సాగునీరు, ప్రజలందరికీ సురక్షిత తాగునీరందించే ప్రభుత్వ సంకల్పం గొప్పదని ఆయన అన్నారు.

కాళేశ్వరం పనులను శనివారం నాడు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన బృందం సభ్యులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను15వ ఆర్ధిక సంఘం కార్యదర్శి ఆరవింద్ మెహతా పరిశీలించారు. అతి తక్కువ వ్యవధిలో ఇంత అద్భుతంగా పనులు జరగటం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. మరొ నాలుగు నెలల్లో 15వ ఆర్ధిక సంఘం ప్రతినిధులందరమూ వస్తామని అరవింద్ మెహతా తెలిపారు. సిద్ధిపేట సమీపంలో నిర్మాణంలో ఉన్న కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన 11 వ ప్యాకేజీ రంగనాయకి సాగర్ పనులు, అన్నారం బ్యారేజీ లను సందర్శించారు.

15 వ ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి వెంట తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ యస్.కె.జోషి, రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణ రావు, సిద్ధిపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ అమేయ కుమార్, జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామా రెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, కాళేశ్వరం సి.ఈ.లు చీఫ్ ఇంజనీర్ హరిరామ్ , వెంకటేశ్వర్లు, ఎస్.ఈ.సుధాకరరెడ్డి వేణు,ఈ.ఈ ఆనంద్ లు ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat