4వ వన్డేలో ధవాన్ సెంచరీ..! – Dharuvu
Breaking News
Home / SPORTS / 4వ వన్డేలో ధవాన్ సెంచరీ..!

4వ వన్డేలో ధవాన్ సెంచరీ..!

జోహన్నెస్‌బర్గ్ వేదికగా శనివారం (ఫిబ్రవరి-10) సౌతాఫ్రికాతో జరుగుతున్న 4వ వన్డేలో టీమిండియా ఓపెనర్ ధావన్ సెంచరీ సాధించాడు. మొదటి  నుంచి ఆతిథ్య బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ భారీ ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. ధావన్‌ 99 బంతుల్లో 10ఫోర్లు, 2 సిక్సర్ల తో సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్‌లో 100వ వన్డే ఆడుతున్న ధావన్‌ అద్భుతంగా రాణిస్తూ న్యూ వాండరర్స్‌ స్టేడియంలో పరుగుల వరద పారిస్తున్నాడు. 100వ వన్డేలో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సైతం నెలకొల్పాడు. వన్డే కెరీర్లో అతనికిది 13వ శతకం కావడం విశేషం.