Home / ANDHRAPRADESH / వచ్చే ఎన్నికల్లో కర్నూల్ జిల్లా పత్తికొండలో బలం ఎవరిది…సర్వేలో నమ్మలేని నిజాలు

వచ్చే ఎన్నికల్లో కర్నూల్ జిల్లా పత్తికొండలో బలం ఎవరిది…సర్వేలో నమ్మలేని నిజాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే .కర్నూలు జిల్లా, డోన్ సమీపంలోని కంబాలపాడుకు చెందిన కృష్ణమూర్తి బీసీ వర్గమమయిన ఈడిగ కులానికి చెందిన నాయకుడు. రెడ్ల రాజకీయాధిపత్యం కొనసాగుతున్న రాయలసీమలో నాయకుడిగా ఎదిగిన ఏకైక బీసీ నేత కేఈ కృష్ణమూర్తియే. కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాబల్యం ఒక వైపు కేఈ కుటుంబం మరొక వైపు- ప్రత్యర్థి కుటుంబాలు. విజయభాస్కర్ రెడ్డిని ఎదిరించి నిలిచిన కుటుంబం ఇదొక్కటే. రాయలసీమలలో చాలామంది బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వారెవరూ నాయకులు కాలేకపోయారు, వారంతా స్థానిక రెడ్డికి అనుచరులుగా మిగిలిపోయారు. అంతేకాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేఈ కృష్ణ మూర్తి ఇంచుమించుగా ఒకే సారి రాజకీయాల్లోకి వచ్చారు. మంత్రులయ్యారు. వారు ముగ్గురు మంచి స్నేహితులని కూడా చెబుతారు. కుటుంబ పరంగా వైఎస్ లాగే కెఇ కూడా ప్రాబల్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు.అయితే, కృష్ణమూర్తి నాయకత్వం కర్నూలు లోక్ సభ నియోజకవర్గం దాటి విస్తరించలేదు. ఒక అగ్రకులం నాయకుడిని ఎదరించి ఫ్యాక్షన్ నడిపే స్థాయికి ఎదిగినా ఆయన అఖిలాంధ్ర బిసినాయకుడు కాలేక పోయారు. ముగ్గురు తమ్ముళ్లు, బలమయిన కులం ఉన్నా ఆయన ములాయం సింగో, లాలూ ప్రసాదో కాలేకపోయారు.

మరోపక్క రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రధాన శక్తిగా మారాడు. జగన్ అంత కాకపోయినా, చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ నాయుడు కూడా నాయకుడయ్యాడు. అయితే, కృష్ణ మూర్తి కుమారుడు శ్యాంబాబు బాగా వెనకబడిపోయాడు. అసలే నాయకుడు అయ్యో లక్షణాలు కనబడడం లేదని సీనియర్ రాజకీయ నాయకులు చేబుతున్నారు. అందుకు కారణాలు కూడ వారు చెప్పారు. అందులో మొడటిది ..ఆయనపై ఇసుక మాఫియా అనే ఆరోపణలు ఉన్నాయి..దీనిపై హైకోర్టులో కేసు కూడ ఉంది..మరోక్కటి పత్తికొండ వైసీపీ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకు కేఈ సోదరులే కారణమని నారాయణరెడ్డి భార్య శ్రీదేవి రెడ్డి, సోదరుడు ప్రదీప్‌రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. కేఈ కుమారుడు శ్యాంబాబు, ఎస్సై నాగ తులసీప్రసాద్‌ హత్యలో కీలకపాత్ర పోషించారని ,పత్తికొండలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆగడాలు ఎక్కువయ్యాయని అన్నారు. దీనిపై నారయణ రెడ్డి బార్య కంగాటి శ్రీదేవి కేసు పెట్టడం కూడ జరిగింది. ఈ రెండు ప్రదానమైన నేరాలు.. ఇంక మరెన్నో నేరాలు ఆయన చేశాడాని ఆమె అన్నారు. ఈవిదంగా కెయి కృష్ణ మూర్తి ప్రతిష్టకు బాగా భంగం కల్గింది. తొలినుంచి తెలుగు దేశం రాజకీయాలు అనుకూలంగా లేకపోవడంతో, ఆయన కుటుంబం నుంచి మరొక తిరుగు లేని నాయకుడు రాలేకపోయాడు. చాలా కాలం తాను ప్రాతినిధ్యం వహించిన డోన్ నియోజకవర్గం 2014లో వైసిపికి వెళ్లి పోయింది. 2014లో వైసీపీ తరుపున అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్ధిని వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రకటించారు. ఓ బహిరంగ సభలో డోన్ నియోజకవర్గ టిక్కెట్‌ను బుగ్గనకు ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. ఆ తర్వాత 2014లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో ముందుగానే ప్రకటించిన హామీ మేరకు బుగ్గన రాజేంద్రనాథ్‌కు డోన్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్‌పై బుగ్గన రాజేంద్ర నాథ్ గెలిచాడు. డోన్ వైసిపి చేతిలోకి పోయింది.

ఇక మిగిలింది పత్తికొండ అది కూడ 2019 లో ఖ‌చ్చితంగా వైసీపీ మాజి ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి బార్య శ్రీదేవి విజ‌యం సాదిస్తుందంటా..ఎలా అంటారా..2019లో ఎన్నికలు ఉంటే 2017 లోనే పాదయాత్రలో బాగంగా కర్నూలు జిల్లాలో మరో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ, వైసీపీ తరుపున అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్ధిని వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రకటించారు. పత్తికొండ వైసీపీ ఆభ్యర్థిగా దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి కంగాటి శ్రీదేవిని వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. పత్తికొండ నియోజవకవర్గంలోని నారాయణరెడ్డి అనుచరులకు అండగా ఉంటామని తెలపడంతో అక్కడికక్కడే ఆయన శ్రీదేవిని నియోజవకర్గ ఇన్‌చార్జిగా ప్రకటించారు. శ్రీదేవికే టిక్కెట్ ఇచ్చినా మాభైవేల మెజార్టీతో గెలిపించుకుంటాని చెప్పారు. ఇంత వరకు ఎవరికి టిక్కెట్ ఇస్తానని చెప్పని జగన్ మొదటి సారి శ్రీదేవిని ప్రకటించారు. ఇచ్చిన మాటను ఆయన నిలుపుకున్నారు.దీంతో నారాయణ రెడ్డి అనుచరులు ఆనందం వ్యక్తం చేశారు.. తప్పకుండ వచ్చే ఎన్నికల్లో శ్రీదేవిని గెలిపిస్తాం అని ఆ నియోజక వర్గ ప్రజలు జగన్ తోనే చెప్పారంట..అంటే ఇక ఆమె గెలుపు ఖాయం అయినట్లే… క‌నుక ఇక కెఈ కృష్ణమూర్తి ముగింపు అనుకుంటున్నారు.రాజ‌కీయ విశ్లేష‌కులు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat