Home / ANDHRAPRADESH / ప్ర‌కాశం జిల్లా.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో… వైసీపీ ప్ర‌కాశించేనా..?

ప్ర‌కాశం జిల్లా.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో… వైసీపీ ప్ర‌కాశించేనా..?

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ స‌ర్వేల మీద స‌ర్వేలు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే ఆ స‌ర్వేల మాట ఎలా ఉన్నా జిల్లాల వారిగా వైసీపీ బ‌లాలు ఏంటో బ‌ల‌హీన‌త‌లు ఏంటో ఒక‌సారి తెలుసుకుందా. ముందుగా వైసీపీ కంచుకోట అయిన ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ ప్ర‌కాశిస్తుందా.. లేక త‌న ప్ర‌భావాన్ని కోల్పోయిందా ఒక‌సారి విశ్లేషించుకుందాం….

See Also:రాజకీయాలను షేక్ చేస్తున్న జగన్ తాజా ట్వీట్…

ప్ర‌కాశం జిల్లాలో ముఖ్యంగా దర్ నియోజ‌క వ‌ర్గంలో ఘన చరిత్ర ఉన్న బుచేపల్లి కుటుంబం పోటీచేయనంటోంది. కనిగిరిలో బొర్రా మధుసూదన్ యాదవ్‌కు ఓటేయం అని రెడ్డి సామాజికవర్గం భీష్మించుకు కూర్చుంది. పేరుకి జిల్లా అధ్యక్షుడైనప్పటికీ బాలినేని శ్రీనివాస రెడ్డి యాక్టివ్‌గా ఉన్నట్టు కనబడడం లేదు. కందుకూరు, చీరాల, పరుచూరు, కొండెపి, గిద్దలూరు, కందుకూరు నియోజకవర్గాలలో అందరూ కొత్త అభ్యర్థులే. సంతనూతలపాడు, ఎర్రగొండపాలెంలో పరిస్థితి మాత్రం ఊరటనిచ్చేవిధంగా ఉంది. క్రితం సారి గెలిచిన మార్కాపురం, అద్దంకిలో పరిస్థితి ఆశించినస్థాయిలో ఆశాజనకంగా లేదనిపిస్తోంది. వైయస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో ప్ర‌కాశం జిల్లోలా కాంగ్రెస్‌ను నడిపించిన టీమ్ రాను రాను త‌న ప్రాభ‌వాన్ని కోల్పోయింది.

See Also:మరోసారి తండ్రి కోడుకుల(బాబు,లోకేష్ ) కు లెక్కలతో చుక్కలు చూపించిన డోన్ వైసీపీ ఎమ్మెల్యే

ప్ర‌కాశం జిల్లాలో నాడు ఉన్న టీంలో పనబాక లక్ష్మీ దంపతులు, దగ్గుబాటి దంపతులు, బాలినేని, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మహిధర్ రెడ్డి, రోశయ్య వంటి మహామహులున్నప్పటికీ పెద్దగా మనస్పర్థలు లేకుండానే ఒకే తాటిమీద ఉంటూ కలిసి పని చేస్తూ.. ప‌య‌నిస్తూ.. కాంగ్రెస్‌ను నిలబెట్టారు. దీంతో 2004 స్వీప్ చేసి, 2009లో మూడు మినహా అన్నీ గెలిచారు. ఇక తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్ర‌కాశంలోని వైసీపీలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఎంతో ఉంద‌ని విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు. పెద్దనేతలను చేర్చుకోవడంతో పాటు అధినాయకుడు కూడా జిల్లా శ్రేణుల్లో ఉన్న నిస్తేజం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పాదయాత్ర జరిగే సమయంలో ప్ర‌కాశంలో వైసీపీకి కొత్త కళను తీసుకొచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలని.. అలా చేస్తేనే ప్ర‌కాశంలో వైసీపీ కోల్పోయిన ప్రాభ‌వాన్ని మ‌ళ్లీ ప్ర‌కాశించేలా చేయ‌వ‌చ్చు అని రాజ‌కీయ నిపుణ‌లు త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat