నాలుగో వన్డేలో .. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్‌…వీడియో – Dharuvu
Breaking News
Home / SPORTS / నాలుగో వన్డేలో .. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్‌…వీడియో

నాలుగో వన్డేలో .. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్‌…వీడియో

దక్షిణాఫ్రికాతో భారత్‌ న్యూ వాండరర్స్‌ మైదానంలో శనివారం జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టేశాడు. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టి ఔరా! అనిపించాడు. ఈ క్యాచ్‌తో భారత్‌ భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. సఫారీ స్పీడ్‌స్టర్‌ రబాడ వేసిన 47వ ఓవర్ ఆఖరి బంతిని భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఐతే తన మీదుగా వెళ్తున్న బంతిని అంచనా వేసిన మార్‌క్రమ్‌ అంతే వేగంగా ఎగిరి బంతిని ఒడిసిపట్టి పాండ్యను పెవిలియన్‌ పంపాడు.

యువ సారథి చేసిన సాహసానికి అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 289 పరుగులు చేసింది. అనంతరం వర్షం అంతరాయం కారణంగా 28 ఓవర్లలో 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 25.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించి విజయం సాధించారు. ఆరు వన్డేల సిరీస్‌లో భారత్‌ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవగా.. దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది.