అక్క అక్రమ సంబంధం… తమ్ముడు సహయం…! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / అక్క అక్రమ సంబంధం… తమ్ముడు సహయం…!

అక్క అక్రమ సంబంధం… తమ్ముడు సహయం…!

ఏపీలో ఈ మద్య అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. వీటి వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి…రోడ్డునా పడుతున్నాయి. తాజాగా వావి వరుసలు మరిచి అక్రమ సంబంధం పెట్టుకుని చివరకు చేయడానికి కూడ వెనుకాడలేదు. తాజాగా గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది.

గత నెల 31వ తేదీన సత్తెనపల్లి మండలం పణిదం సమీపంలో ఉన్న పంట పొలాల్లో ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహాం బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలేనికి చెందిన పగడాల బుజ్జిబాబు అనే వ్యక్తిదిగా నిర్దారించారు. మిస్టరీ కేసుగా నమోదైన ఈ హత్యకు సంబంధించి పలు విస్తుపోయే విషయాలు తాజాగా వెలుగుచూశాయి

పగడాల బుజ్జిబాబు ,భార్య ఆదిలక్ష్మితో కలిసి గంగిరెడ్డిపాలెంలో నివసిస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఆకుల నాగేశ్వరరావుతో బుజ్జిబాబు భార్యకు అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో వీరి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న బుజ్జిబాబును అడ్డు తొలగించుకోవడానికి ఆదిలక్ష్మి నాగేశ్వరరావుతో కలిసి పక్క ప్లాన్ వేసింది. ఆదిలక్ష్మితో కలిసి వేసిన ప్లాన్ మేరకు నాగేశ్వరరావు ఆమె తమ్ముడు జాలె సుబ్బారావును సంప్రదించాడు. బుజ్జిబాబును హతమార్చితే గతంలో తన వద్ద తీసుకున్న రూ.3 లక్షల అప్పు మాఫీ చేస్తానని చెప్పాడు. దీంతో బాకీ తీరిపోతుందన్నఆలోచనతో బావను చంపడానికి ఒప్పుకున్నాడు. కుదుర్చుకున్న ఒప్పందం మేరకు జనవరి 31న బుజ్జిబాబును హత్య చేసెందుకు రెడి అయ్యాడు. ఒక రోజు బుజ్జిబాబు గుంటూరులో జరిగిన బంధువు సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యాడు. స్నేహితులు మద్దు శ్రీను అలియాస్‌ జంబో, ఉక్కలం రామయ్య అలియాస్‌ బాబులను తీసుకుని సుబ్బారావు కూడా ఆ కార్యక్రమానికి వెళ్లారు. సంస్మరణ కార్యక్రమం ముగిసిన తర్వాత బావ బుజ్జిబాబును తీసుకుని స్నేహితులతో కలిసి ఆటోలో బయలుదేరాడు సుబ్బారావు. అందరు అప్పటికే ఫుల్ గా మద్యం సేవించి ఉన్నారు. ఆటో పణిదం పంట పొలాల వద్దకు రాగానే బండరాయితో బుజ్జిబాబు తలపై కొట్టి హత్య చేశాడు సుబ్బారావు. ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు హతుని భార్య ఆదిలక్ష్మితోపాటు ఆకుల నాగేశ్వరరావు, జాలె సుబ్బారావు, మద్దు శ్రీను, ఉక్కలం రామయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలక్ష్మి తో సహ మిగిలిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.