ప్రేమ…పెళ్లి..పెద్దల ఎంట్రీ..నలిగిపోయిన నవ వధువు..! – Dharuvu
Breaking News
Home / CRIME / ప్రేమ…పెళ్లి..పెద్దల ఎంట్రీ..నలిగిపోయిన నవ వధువు..!

ప్రేమ…పెళ్లి..పెద్దల ఎంట్రీ..నలిగిపోయిన నవ వధువు..!

పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న యువతి ఆశలు మూడు రోజుల్లోనే వాడిపోయాయి. పెద్దల మాటవిని పుట్టింటికి వెళ్లిన ఆమె.. చివరకు అక్కడి స్నానాల గదిలో ఓ యువతి ప్రాణం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌లోని చుడీబజార్‌కు చెందిన నీలం అనే 23 ఏళ్ల యువతి… జియాగూడకు చెందిన ఆకాష్‌సింగ్ అనే యువకుడిని ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ఈ నెల 7న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్న ప్రేమికులు…అనంతరం కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. సమాచారంతో కుల్సుంపురా పీఎస్‌కు చేరుకున్న యువతి కుటుంబసభ్యులు… పెళ్లికి అంగీకరించినట్టు చెబుతూ నీలంను ఇంటికి తీసుకెళ్లి పోయారు. ఈ నెల 9వ తేదీన యువతి బాత్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. మరో పెళ్లి చేసుకోవాలంటూ కుటుంబసభ్యులు యువతిపై వత్తిడి తీసుకురావడమే కారణంగా అనుమానిస్తున్నారు పోలీసులు… నీలంకు తొమ్మిది నెలల క్రితమే ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయ్యింది… ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువకుడిని విడిచి… తాము చూసిన సంబంధాన్నే చేసుకోవాలన్న ఒత్తిడి చేయడంతో ఏం చేయాలో తోచక ఆత్మహత్యకు పాల్పడిఉంటుందని అంటున్నారు. ఏదేమైనా ప్రేమ… పెద్దల మధ్య నలిగిపోయిన ఆ నవ వధువు పెళ్లి చేసుకున్న మూడు రోజులకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.