పొడి దగ్గును తగ్గించే అద్భుతమైన చిట్కాలు – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / పొడి దగ్గును తగ్గించే అద్భుతమైన చిట్కాలు

పొడి దగ్గును తగ్గించే అద్భుతమైన చిట్కాలు

సాధారణంగా శీతాకాలంలో అందరిని బాధపెట్టే సమస్య పొడిదగ్గు.పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ పొడిదగ్గుతో సతమతం అవుతూ ఉంటారు.మనం తీసుకునే శ్వాస క్రియలకు ఆటంకం ఏర్పడినప్పుడు దగ్గు వస్తుంది.ఇది ఎక్కువగా వాతావరణ మార్పుల వలన , శీతలపానీయాలను ఎక్కువగా త్రాగడం వలన వస్తుంది.అయితే ఇలాంటి పొడి దగ్గును ఇంట్లో ఉండే
దినుసులను ఉపయోగించి ఉపశమనాన్ని పొందవచ్చు . అందులో కొన్ని అద్భుతమైన చిట్కాలు మీకోసం..

  • పొడి దగ్గు భాదిస్తున్నపుడు అల్లం టీ ని తీ సుకోవడం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు
  • చిటికెడు పసుపు,నిమ్మరసం మరియు తే నే కలిపినా మిశ్రమాన్ని మూడు పూటలా తీ సుకోవాలి.
  • అర టీ స్పూన్ శొంటి పొడిని ఒక టీ స్పూన్ తే నెలో కలిపి తీ సుకుంటే దగ్గు నుండి ఉపశమనం లబిస్తుంది.
  • పొడి దగ్గుతో భాదపడుతూ ఉంటే అర టీ స్పూన్ ఇంగువపొడి ,ఒక టీ స్పూన్ తాజా అల్లం రసం ,ఒక టేబుల్ టీ స్పూన్ తేనే ను బాగా కలిపినా మిశ్రమాన్ని రోజుకు రెండు పూటల తీ సుకోవడం వల్ల దగ్గు ను తగ్గించుకోవచ్చు.
  • కరక్కాయ కూడా పొడి దగ్గును తగ్గించడంలో దోహద పడుతుంతి .కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగడం చేస్తే పొడి దగ్గు వెంటనే తగ్గిపోతుంది.
  • పాలలో మిరియాల పొడి వేసుకొని తా గితే దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
  • తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని త్రాగడం ద్వారా దగ్గు ను తగ్గించుకోవచ్చు
  • తమలపాకును నమలడం వల్ల కూడా పొడి దగ్గు నుంచి విముక్తి పొందవచ్చు.గోరువెచ్చని నీరు తీ సుకోవడం ద్వార దగ్గిన గొంతుకు ఉపశమనం కలుగుతుంది.