నల్గొండ జిల్లాలో సంచలనం-మరో కాంగ్రెస్ నేత దారుణ హత్య … – Dharuvu
Breaking News
Home / SLIDER / నల్గొండ జిల్లాలో సంచలనం-మరో కాంగ్రెస్ నేత దారుణ హత్య …

నల్గొండ జిల్లాలో సంచలనం-మరో కాంగ్రెస్ నేత దారుణ హత్య …

తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఇటివల నల్గొండ మున్సిపల్ చైర్ పర్శన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్య సంఘటనను మరిచిపోకముందే అదే పార్టీకి చెందిన మరో నేత దారుణ హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

జిల్లాలో తిరుమలగిరి మండలంలో చింతలపాలెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కాంగ్రెస్ నేత ధర్మానాయక్ పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేసి మరి హత్య చేశారు.

మంగళవారం తెల్లారు జమున నాటు బాంబుతో దాడి చేయడంతో ధర్మా అక్కడక్కడే మృతి చెందాడు.రాత్రి నిద్రిస్తున్నమంచం కింద బాంబు పెట్టడంతో అది పేలి ధర్మా అక్కడక్కడే మరణించాడు.