శివ నామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు..! – Dharuvu
Home / BAKTHI / శివ నామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు..!

శివ నామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు..!

ఇవాళ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. ఆదిదేవుడికి అర్చనలు అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, వరంగల్ లోని వేయి స్తంభాల దేవాలయం ,కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, చెరువుగట్టు, కాళేశ్వరం ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భక్తుల పోటెత్తారు. శివ నామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం పుణ్యక్షేత్రం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుడి ఆలయంతో పాటు పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంలోని పరమశివుడి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.