అక్రమ సంబంధం.. మంచం కింద బాంబు పెట్టి మరీ.. – Dharuvu
Breaking News
Home / CRIME / అక్రమ సంబంధం.. మంచం కింద బాంబు పెట్టి మరీ..

అక్రమ సంబంధం.. మంచం కింద బాంబు పెట్టి మరీ..

ప్రస్తుతం లోకంలో ఎక్కడ చూసిన కానీ అక్రమ సంబంధాల గొడవే.భార్య ఉండగా భర్త ఇంకొకరితో ..భర్త ఉండగా భార్య ఇంకొకరితో ఇలా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ తమకు అడ్డు వస్తున్న భార్యను ,భర్తను అడ్డుతగిలించుకోవడానికి హత్యలాంటి దారుణాలకు కూడా పాల్పడుతున్న పలు సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.

see also :వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు

తాజాగా మరో ఇలాంటి దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.తెలంగాణ రాష్ట్రంలో మిర్యాలగూడ లో నాగార్జున తండా ఉపసర్పంచ్ దేపావాత్ ధర్మనాయక్ రెండో భార్య అయిన శిరిషకు అదే తండాకి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది.అయితే ఈ విషయం తెల్సిన భర్త ధర్మా పలు మార్లు భార్య శిరిషకు చెప్పి పద్దతి మార్చుకోమని సలహా ఇచ్చాడు .అయితే తమకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని శిరీష తన ప్రియుడితో కల్సి భర్తను చంపాలనే ప్లాన్ వేసుకున్నది.అనుకున్నదే తడవుగా ధర్మానాయక్ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మంచం కింద బాంబు పెట్టి మరి దారుణంగా హత్య చేయించింది.దీంతో ధర్మా శరీర భాగాలు చిందరవందరగా పడి అక్కడక్కడే ధర్మా చనిపోయాడు.అయితే ఈ ఘటన మీద మృతుడి తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ..

see also :ఎంపీ పదవీ నుండి బుట్టా రేణుక ఔట్ ..కారణం ఇదే ..!