లవర్స్ డే సందర్బంగా ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్..! – Dharuvu
Breaking News
Home / TECHNOLOGY / లవర్స్ డే సందర్బంగా ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్..!

లవర్స్ డే సందర్బంగా ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్..!

రేపు ప్రేమికుల రోజు సందర్బంగా ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ అద్బుతమైన ఆఫర్లను ప్రారంబించబోతుంది.రేపు ( ఫిబ్రవరి 14 వాలెంటైన్స్‌ డే సందర్భంగా) ” ది ఫ్లిప్‌హార్ట్‌ డే’ సేల్‌ నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ప్రకటించింది.ఈ భారీ సేల్లో భాగంగా HDFCడెబిట్ కార్డ్ మరియు క్రెడిట్ కార్డ్ లపై 14% ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను అందించనుంది. యూజర్లు ఎవరైతే ‘ది ఫ్లిప్‌హార్ట్‌ డే’ ఆఫర్‌లో సైన్‌-అప్‌ అవుతారో వారికి వస్త్రాలు, బ్యూటీ, యాక్ససరీస్‌, హోమ్‌ డెకర్‌లపై 14 శాతం అదనపు డిస్కౌంట్‌ను అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.ఒకవేళ ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్‌ బ్యాంకులు, టాబ్లెట్లు, ఇతర యాక్ససరీస్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి, 80 శాతం డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. టీవీ, హోమ్‌ అప్లియెన్స్‌పై 70 శాతం వరకు, ఫర్నీచర్‌, డెకర్‌, ఫర్నీషింగ్‌ వాటిపై 40 % నుంచి 80% వరకు డిస్కౌంట్లను ఆఫర్‌ చేయనున్నట్టు తెలిపింది . కనీసం 40 శాతం, 50 శాతం, 60 శాతం డిస్కౌంట్లతో ‘ఫెంటాస్టిక్‌ డీల్స్‌’ ను అందుబాటులో ఉంచుతామని ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ తెలిపింది.