ఎక్కువచేస్తే హీరోయిన్ల తొకలను కత్తిరిస్తాం ..శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు – Dharuvu
Home / MOVIES / ఎక్కువచేస్తే హీరోయిన్ల తొకలను కత్తిరిస్తాం ..శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు

ఎక్కువచేస్తే హీరోయిన్ల తొకలను కత్తిరిస్తాం ..శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )అధ్యక్షుడు ,సీనియర్ నటుడు శివాజీ రాజా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 28న అమెరికాలో డల్లాస్ నగరంలో మా సిల్వర్ జుబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.తమ అసోసియేషన్ కు అన్ని వేళల అండగా ఉంటూ సాయసహకరాలను అందిస్తున్ననాగార్జున , బాలకృష్ణ,చిరంజీవి,మోహన్ బాబు ,వెంకటేష్ ,మహేష్ బాబు గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

అయితే తమ అసోసియేషన్ కు ఎంతోమంది సాయమందిస్తున్న కానీ హీరోయిన్లు మాత్రం అసలు ముందుకు రావడంలేదు.మాకు సహకరించండి అని వేడుకుంటున్న కానీ అసలు మాట వినడంలేదు.ఇండస్ట్రీలో ఉన్న వారిలో ఇద్దరో ముగ్గురో సాయం చేస్తున్న కానీ మిగతావారు మాత్రం అసలు ముందుకు రావడంలేదు .

మేము ఇండస్ట్రీలో ముప్పై ఏళ్ళుగా ఉంటున్నాం.మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాం .మిమ్మల్ని మేము డబ్బులు అడగటంలేదు.కార్యక్రమానికి రండి అంటున్నాం .సాయమందించాలని కోరుతున్నాం .కానీ ఎవరు పట్టించుకోవడంలేదు.ఎక్కువ చేస్తే తోకలు కత్తిరిస్తాం ..మాకు సాయం చేయకపోతే మీరు అవసరం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.