అతి తక్కువ ధరకే ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్ – Dharuvu
Breaking News
Home / SLIDER / అతి తక్కువ ధరకే ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్

అతి తక్కువ ధరకే ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్

ప్రముఖ దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఇంటెక్స్’ మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ‘ఆక్వాలయన్స్ టీ1 లైట్’ పేరుతో సోమవారం దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 4,449. ఈ మొబైల్ 21 భాషలను సపోర్టు చేస్తుందని ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి మార్కేండేయ తెలిపారు. ఇంటెక్స్‌ వాల్యూ యాడెడ్‌ సర్వీసులు ఎల్‌ఎఫ్‌టీవై(సింగిల్‌-స్వైప్‌ యాక్సెస్‌), డాటాబాక్‌, ప్రైమ్‌ వీడియాలు దీనిలో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

ఇంటెక్స్ ‘ఆక్వాలయన్స్ టీ1 లైట్’ పీచర్లు.

  • 5 అంగుళాల డిస్‌ప్లే
  • 1 జీబీ ర్యామ్‌
  • 8 జీబీ ఇంటర్నల్‌ మెమరీ( 64 జీబీ వరకు పొడిగించుకునే అవకాశం)
  • 1.3గిగా హెర్జ్‌ ప్రాసెసర్ క్వాడ్‌కోర్‌ 64 బిట్‌ మీడియాటెక్‌ చిప్‌సెట్‌
  • 5 మెగా పిక్సెల్‌ బ్యాక్ కెమెరా
  • 2 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
  • డ్యూయల్‌ సిమ్‌,4జీ వీవోఎల్‌టీఈ
  • 2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌

ఆండ్రాయిడ్‌ నౌగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌