వైసీపీ శ్రేణులు తలెత్తుకునే వార్త ..ఈసారి ఏపీ ప్రజలు పట్టం కట్టడం ఖాయం.. – Dharuvu
Home / ANDHRAPRADESH / వైసీపీ శ్రేణులు తలెత్తుకునే వార్త ..ఈసారి ఏపీ ప్రజలు పట్టం కట్టడం ఖాయం..

వైసీపీ శ్రేణులు తలెత్తుకునే వార్త ..ఈసారి ఏపీ ప్రజలు పట్టం కట్టడం ఖాయం..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఆయన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఎనబై ఆరో రోజు పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో నిన్న సోమవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అయిన తర్వాత నెల్లూరులో వైసీపీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ ,నియోజక వర్గ సమన్వయ కర్తలతో పాటు కల్సి దాదాపు రెండు గంటల పాటు సమావేశం నిర్వహించారు.

see also : అతి తక్కువ ధరకే ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్

ఈ సమావేశం సందర్భంగా జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ..వైసీపీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,నేతలు తమ వాణిని వినిపించాలని ..వచ్చే నెల ఒకటో తారీఖున రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ఎదుట ధర్నా చేయాలనీ జగన్ సూచించారు.అనంతరం జగన్ దేశ రాజధాని ఢిల్లీకి వైసీపీ నేతలను పంపించి అక్కడ జంతర మంతర్ దగ్గర మార్చి ఐదో తారిఖు నుండి ఏప్రిల్ ఆరో తారిఖు వరకు ధర్నాలు ,నిరసనలు చేయాలనీ జగన్ సూచించారు.

see also : అక్రమ సంబంధం.. మంచం కింద బాంబు పెట్టి మరీ..

ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా రాజీనామా చేయాలనీ ఆయన వివరించారు .అయితే రాష్ట్రానికి ఒకవేళ కేంద్రం దిగొచ్చి ప్రత్యేక హోదా ఇస్తే జగన్ సీఎం కావడం ఖాయం ..ఒకవేళ ఇవ్వకపోయినా ప్రజలు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయిస్తాడు కాబట్టి ఆ విధంగా కూడా ప్రజలు ఆదరించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం ఖాయం అని అంటున్నారు రాజకీయ వర్గాలు  ..

see also :తెలుగు మీడియా ఛానల్ లో ప్రసారం కానీ వీడియో దరువు చేతిలో ..