పవన్ పై అదిరిపోయే పంచులేసిన కిషన్ రెడ్డి – Dharuvu
Breaking News
Home / POLITICS / పవన్ పై అదిరిపోయే పంచులేసిన కిషన్ రెడ్డి

పవన్ పై అదిరిపోయే పంచులేసిన కిషన్ రెడ్డి

టాలీవుడ్ స్టార్ హీరో జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు పవన్‌ కల్యాణ్‌ హావభావాలు చూస్తే నవ్వొస్తోందని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ప‌వ‌న్ త‌న సోద‌రుడు చిరంజీవి కార‌ణంగా సినిమాల్లో,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయిలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి అండతో సినిమాల్లోకి వచ్చాడు.నటన రాకపోయినా సరే తన అన్నను చూసి అవకాశాలు వచ్చాయి.అసలు సరిగ్గా కదలకుండా డైలాగ్ కూడా చెప్పడం రాని పవన్ కళ్యాణ్ ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను మాత్రమే ఇక్కడ తీసి పెద్ద హీరో స్థాయికి ఎదిగారు తప్పా సొంతగా ఎదగలేదు అని ఆయన అన్నారు .ఇంకా మాట్లాడుతూ రాజకీయల్ల్లో కూడా మీడియా ద్వారా రాజకీయ నాయకుడు కావాలని ఆరాటపడుతున్నాడు.అయితే ఇప్పటివరకు ఉన్న రాజకీయ నాయకులు ఎవరు కూడా మీడియా వలన పెద్ద పెద్ద నాయకులు కాలేదు .ప్రజలు ఆదరించి ఓట్లేస్తేనే నాయకులవుతారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .