వాళ్ళు నన్ను డేటింగ్ కు రమ్మంటున్నారు .. – Dharuvu
Breaking News
Home / MOVIES / వాళ్ళు నన్ను డేటింగ్ కు రమ్మంటున్నారు ..

వాళ్ళు నన్ను డేటింగ్ కు రమ్మంటున్నారు ..

కేవలం ఒక్క వీడియో ..అది కూడా ఇరవై ఆరు సెకండ్ల సమయంలో మాత్రమే నటించి కొన్ని లక్షల మంది యువతను ముఖ పుస్తకంలో ..ట్విట్టర్ లో ..ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులుగా సొంతం చేసుకున్న బ్యూటీ ప్రియ ప్రకాష్ వారియర్ .ఒరు ఆదర్ లవ్ లోని మాణిక్య మలరయ అనే సాంగ్ లో ప్రియ చేసిన నటనకు అందరు ఫిదా అయిపోయారు .

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ లాంటి తెలుగు హీరోలతో పాటుగా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అజిత్ లాంటి స్టార్ హీరోలు కూడా అమ్మడు ఫ్యాన్ అయిపోయారు అంటేనే చెప్పొచ్చు అమ్మడు ఎంత చక్కగా నటించిందో .అయితే ఓవర్ నైట్లో తనకు వచ్చిన పాపులారిటీ గురించి అమ్మడు మాట్లాడుతూ ఒక్క వీడియోతో నాకు అభిమానులుగా మారిపోయిన అందరికి ప్రత్యేక కృతఙ్ఞతలు .

అయితే ఇందులో నాదేమి లేదు .దర్శకుడు చెప్పిన విధంగా నటించాను .అయితే ఈ వీడియో చూసిన తర్వాత అందరు నా ఫ్యాన్ అయిపోయారు .కొంతమంది అయితే ఏకంగా నన్ను డేటింగ్ కు రమ్మంటున్నారు అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు .