పార్టీ మారకపోతే చంపేస్తమంటున్నారు-వైసీపీ నేత… – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / పార్టీ మారకపోతే చంపేస్తమంటున్నారు-వైసీపీ నేత…

పార్టీ మారకపోతే చంపేస్తమంటున్నారు-వైసీపీ నేత…

ఏపీలో అనంతపురం జిల్లాలో అధికారం అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ మాట వినని సామాన్య ప్రజల మీద ,వారికీ అండగా ఉంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలపై అక్రమ కేసులను బనాయించి వేధిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరాలి .టీడీపీలో చేరకపోతే చంపేస్తామని అధికార టీడీపీ నేతలు బెదిరిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.జిల్లాలో మంత్రి పరిటాల సునీత ఆదేశాలతో తెలుగు తమ్ముళ్ళు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు .బోయ సూర్యం అనే వైసీపీ సీనియర్ కార్యకర్త మీడియాతో మాట్లాడుతూ మంత్రి అదేశాలతోనే తనను పార్టీ మారాలని బెదిరిస్తున్నారు.

పార్టీ మారకపోతే అక్రమ కేసులను బనాయించి చంపేస్తామని బెదిరిస్తున్నారు.ఇటివల ఏకంగా మంత్రి తనయుడు శ్రీరామ్ సమక్షంలోనే తనపై దాడులకు దిగారు.అయితే తనపై దాడులు చేయలేదని తెలుగు తమ్ముళ్ళు బెదిరించి సంతకాలను సేకరించారు అని సూర్యం వాపోయారు .మంత్రి కుటుంబం నుండి తనకు ప్రాణహాని ఉందని ..తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు