హాజరు కానున్న సీఎం కేసీఆర్..! – Dharuvu
Breaking News
Home / BAKTHI / హాజరు కానున్న సీఎం కేసీఆర్..!

హాజరు కానున్న సీఎం కేసీఆర్..!

యదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 23న శ్రీవారి ఎదుర్కోలు మహోత్సవం, 24న కల్యాణం నిర్వహించనున్నారు . ఈ నెల 24న సీఎం కేసీఆర్ సతీసమేతంగా కల్యాణోత్సవానికి హాజరై పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి సమర్పిస్తారని యాదాద్రి ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. 25న దివ్యవిమాన రథోత్సవం, 26న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, 27న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిస్తామన్నారు. రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.