మరోసారి టాలీవుడ్ ను కుదిపేస్తున్న రంగస్థలం లేటెస్ట్ సాంగ్..! – Dharuvu
Breaking News
Home / MOVIES / మరోసారి టాలీవుడ్ ను కుదిపేస్తున్న రంగస్థలం లేటెస్ట్ సాంగ్..!

మరోసారి టాలీవుడ్ ను కుదిపేస్తున్న రంగస్థలం లేటెస్ట్ సాంగ్..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్కినేని కోడలు సమంత కాంబినేషన్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో వస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం.ఈ సినిమాకి సంబంధించిన ఒక పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.‘వేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకేబిందెలాగ ఎంతసక్కగున్నావే..లచిమి ఎంత సక్కంగున్నావే, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే చేతికి అందిన చందమామలాగ ఎంత సక్కగున్నావే..లచిమి’ అంటూ పల్లెటూరు అమ్మాయిని పొగుడ్తూ రాసిన పాట చాలా బాగుంది. చంద్రబోస్ ఈ పాటను రాయగా..మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.కాగా వచ్చే నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే..