ప్రేమికుల రోజు అదేనండి వాలెంటైన్స్ డే.. ఈ రోజుని, ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచ నలుమూలల, కొన్ని కోట్ల జంటలు ఎంతో వైభవంగా ఈ రోజుని జరుపుకోవడానికి ప్రాధాన్యతనిస్తాయి. ఈ రోజుని మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి జంటలు ఒకరికొకరు విభిన్నరకాలైన బహుమతుల దగ్గర నుండి రోజా పూలు, టెడ్డి బేర్ లు మరియు హృదయ ఆకారంలో ఉన్న లాకెట్లు ఇలా ఎన్నింటినో బహుమతులుగా ఇస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకమైన ప్రేమికుల రోజు సందర్భంగా పురుషులు, వారు ప్రేమించే స్త్రీలను విపరీతంగా పొగుడుతుంటారు మరియు విభిన్న రకాల వస్తువులను వారికి బహుమతులుగా ఇచ్చి, వారిని ఆనందపరచాలని ప్రయత్నిస్తుంటారు.
అయితే ప్రేమికుల రోజు సందర్భంగా వాషి రైల్వేస్టేషనులో యువతీ,యువకులు ఏడువేల కండోమ్ లను ఉచితంగా పంపిణీ చేశారు. ముంబై నగరంలోని కాలంబోలి సెక్టార్ 11 కు చెందిన ఎహెచ్ఎఫ్ జ్యోతీ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వాలంటీర్లు ఉచితంగా యువతీ యువకులకు కండోమ్ లను పంపిణీ చేశారు. నేడు తాము చాలామంది హెచ్ఐవీ పాజిటివ్ బాధితులను చూస్తున్నామని, వారిలో చాలామంది పేదవారని , ఈ భయంకరమైన వ్యాధి రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ యువతలో అవగాహన కల్పించేందుకే తాము కండోమ్ లను పంపిణీ చేశామని కాలంబోలి కేర్ సెంటర్ నిర్వాహకురాలు సిస్టర్ నీలిమా చెప్పారు.