సీఎం కేసీఆర్‌కు ద‌రువు అధినేత జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు..! – Dharuvu
Breaking News
Home / EDITORIAL / సీఎం కేసీఆర్‌కు ద‌రువు అధినేత జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు..!

సీఎం కేసీఆర్‌కు ద‌రువు అధినేత జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు..!

తెలంగాణ రాష్ట్ర ప్ర‌దాత‌, స్వ‌రాష్ట్ర సాధ‌న విజేత, టీఆర్ఎస్ అధినేత కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా `ద‌రువు` వెబ్‌సైట్‌, కరణ్ కాన్సెప్ట్స్ ( సోష‌ల్ మీడియా క్యాంపెయిన్ ) అధినేత చెరుకు క‌ర‌ణ్‌రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. శనివారం బేగంపేట‌లోని ముఖ్య‌మంత్రి నివాస‌మైన ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు వెళ్లిన క‌ర‌ణ్ రెడ్డి ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు బొకే అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయ‌న ఆయురారోగ్యాలు, ఆనందోత్సాహాల‌తో జీవించాల‌ని ఈ సంద‌ర్భంగా ఆకాంక్షించారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ద‌రువు అధినేత క‌ర‌ణ్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపారు.డిజిట‌ల్ జ‌ర్న‌లిజం, సోష‌ల్ మీడియాలో `ద‌రువు` ప్ర‌త్యేక‌త త‌న దృష్టికి వ‌చ్చింద‌ని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మ‌న‌మంతా భాగ‌స్వామ్యం కావాల‌ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు.