Home / SLIDER / విద్యార్థులకు సంచలనాత్మక పిలుపునిచ్చిన మంత్రి హరీష్..

విద్యార్థులకు సంచలనాత్మక పిలుపునిచ్చిన మంత్రి హరీష్..

సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రూరల్ ఇర్కోడ్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఆదివారం జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు  హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు. 3వేల మొక్కలతో ఆకుపచ్చగా రాష్ట్రంలోనే మోడల్ స్కూల్ గా.. ఇర్కోడ్ మోడల్ స్కూలుని చూడగలుగుతున్నామని, ఇర్కోడ్ మోడల్ స్కూల్ మీదికి ఏ ప్రైవేటు మోడల్ స్కూల్ కూడా రాదని అన్నారు. ఇదే తరహాలో ప్రతి విద్యార్థి తమ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక మొక్కను నాతడమే కాదు, దాని సంరక్షిస్తామని వృక్షా బంధన్ కట్టి.., మనం ఎదుగుతున్న మాదిరిగానే ఆ మొక్కలు ఎదగాలని ప్రతినబూనాలని విద్యార్థులకు మంత్రి పిలుపు ఇచ్చారు.

ఇర్కోడ్ మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐఐఐటీలో 10 సీట్లు రావడం సంతోషకరమైన విషయమని ప్రిన్సిపాల్ నాగరాజును మంత్రి అభినందించారు. కాంపీటేషన్ ఎగ్జామ్స్ లో అత్యుత్తమ స్థాయిలో ర్యాంకులు సాధించి ఇర్కోడ్ మోడల్ స్కూల్ జిల్లాకే మోడల్ గా నిలిచిందని తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులంతా ఇదే స్పూర్తితో ఇంకా మంచి స్థానాలు పొందాలని మంత్రి ఆకాంక్షించారు. ఇర్కోడ్ మోడల్ స్కూల్, కళాశాల అభివృద్ధికై మంత్రి హరీశ్ రావు నిధుల వర్షం కురిపించారు. స్కూల్ ఆవరణ ప్రాంతమంతా సీసీ రోడ్లు వేయించేందు కోసం రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పాఠశాల పై అంతస్తులో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. వచ్చే నెలరోజుల్లో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయించేలా చర్యలు చేపడుతామని చెప్పారు.

ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ తీరును మంత్రి తప్పుబడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చిందని.., బీజేపీ ప్రభుత్వం తీసుకున్నదని., కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ నిల బెట్టారని చెప్పారు. మోడల్ స్కూల్స్ లో చదివే బాలుర కోసం వసతి గృహం నిర్మించేలా ప్రభుత్వం తరపున కృషి చేస్తానని మంత్రి చెప్పారు. విద్యార్థులంతా మంచిగా చదువుకుని మీ తల్లిదండ్రులకు, గురువులకు, మీ పాఠశాలకు మంచి పేరు తేవాలని.. ఇందు కోసం తన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చి ఐఐటీలో సీట్లు పొందిన విద్యార్థినీ, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను శాలువాతో ఘనంగా మంత్రి సన్మానం చేశారు. అంతకు ముందు పాఠశాల, కళశాల విద్యార్థినీ, విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడి వారందర్నీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఇర్కోడ్ గ్రామ సర్పంచ్ మారెడ్డి వినీత-రవీందర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat