తొలి టీ20లో భారత్ ఘన విజయం – Dharuvu
Home / SLIDER / తొలి టీ20లో భారత్ ఘన విజయం

తొలి టీ20లో భారత్ ఘన విజయం

ఈ రోజు సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో భారత్ ఘన విజయం సాధించింది. 28 ప‌రుగుల తేడాతో స‌ఫారీల‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది. ధావ‌న్ (72) అర్ధ‌సెంచ‌రీతో అందరిని ఆక‌ట్టుకున్నాడు. రోహిత్ (21), రైనా(15), కోహ్లీ(26), పాండే (29) త‌లో చేయి వేయ‌డంతో భార‌త్ భారీ స్కోర్ చేయ‌గ‌లిగింది. అనంత‌రం 204 ప‌రుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాను భువ‌నేశ్వ‌ర్ దెబ్బ‌కొట్టాడు. నాలుగు ఓవ‌ర్లు వేసిన భువ‌నేశ్వ‌ర్ 24 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు.