రేపు హైద‌రాబాద్‌కు మోడీ..! – Dharuvu
Breaking News
Home / SLIDER / రేపు హైద‌రాబాద్‌కు మోడీ..!

రేపు హైద‌రాబాద్‌కు మోడీ..!

ప్రధాని నరేంద్ర మోదీ రేపు ( సోమవారం ) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి రానున్నారు.నగరంలో రేపు ప్రారంభం కానున్న రెండు అదిపెద్ద కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నాస్కామ్ ఇండియా లీడర్‌షిప్ ఫోరం(ఎన్ఐఎల్ఎఫ్), వరల్డ్ కాంగ్రెస్ ఐటీ(డబ్ల్యూసీఐటీ) కార్యక్రమాలు సోమవారం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలకు భాగ్యనగరం వేదికైంది. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా పూర్తయినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.