ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు.. – Dharuvu
Breaking News
Home / SLIDER / ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..

ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..

తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండల టీఆరెస్ సమావేశం ఈరోజు ఆదివారం ఇందుర్తి గ్రామంలో జరిగింది! ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన వారు ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ సమక్షంలో టీఆరెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లడుతూ టీఆరెస్ ప్రభుత్వ తీరు గమనించి చాలా మంది ఇతర పార్టీలకు చెందిన వారు ఆకర్శితులవుతున్నారని తెలిపారు. దేశమంతా తెలంగాణా వైపు చూస్తోందని, కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు రైతు సంక్షేమం కోసం కేసీఅర్ ఎంతగానో కృషి చేస్తున్నరని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు జరిగాయని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే హుస్నాబాద్ సస్యస్యామలం అవుతుందన్నారు. కాళేశ్వరం నుండి సాగునీరు మిడ్ మానేరుకు అక్కడి నుండి గండిపల్లి గౌరవెల్లి ప్రాజెక్టులను సాగు నీరు అందుతుందన్నరు. మిడ్ మానేరు కుడి కాలువ ద్వారా చిగురుమామిడి సైదాపూర్ మండలాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. కరవు ప్రాంతంగా ఉన్న మెట్ట ప్రాంతం సీ ఎం కేసీఆర్ కృషి ఫలితంగా సస్యస్యామలం కబోతున్నదని ఆయన అన్నారు.

టీఆరెస్ కార్యకర్తలు కంకకణ బద్దులై పని చేయాలని, సైనికుల్లా పని చేయాలన్నారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. కార్యకర్తలే పార్టీకి గుండెకాయ అని, పార్టీని నడిపేది, అధికారంలోకి తెచ్చేది కార్యకర్తలే అని అన్నారు. గ్రామస్థాయి, బూతు స్థాయిల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. అందరూ సమన్వయంతో పని చేయాలని, విభేదాలు విడనాడాలని సూచించారు.