మిషన్ భగీరథ పనుల్లో అద్భుతం .. – Dharuvu
Breaking News
Home / SLIDER / మిషన్ భగీరథ పనుల్లో అద్భుతం ..

మిషన్ భగీరథ పనుల్లో అద్భుతం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి చేయని శపదం రానున్న ఎన్నికల్లోపు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించకపోతే ఓట్లు అడగను అని .అయితే అప్పట్లో సీఎం కేసీఆర్ చేసిన శపదం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.

ఈ క్రమంలో ఇంటి ఇంటికి నీరందించడానికి టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం మిషన్ భగీరథ.రాష్ట్ర వ్యాప్తంగా తొంబై శాతంకి పైగా భగీరథ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.

ఈ నేపథ్యంలో భద్రాది-కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు మండలంలో మిషన్ భగీరథ పనుల్లో అత్యాద్భుతం జరిగింది.భగీరథ పనులు చేస్తున్న క్రమంలో బ్రిటిష్ కాలం నాటి సింగరేణి భూగర్భ గని ఒకటి వెలుగులోకి వచ్చింది .ఈ సమాచారం అందించుకున్న సింగరేణి అధికారులు ఆ గనిని పరిశీలించి ఇది సుమారు నూట ఇరవై సవంత్సరాల కిందటిది తేల్చి చెప్పారు .