Home / MOVIES / జూనియర్ ఎన్టీఆర్‌కు రెండో సంతానం..!

జూనియర్ ఎన్టీఆర్‌కు రెండో సంతానం..!

టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమాలతోనే కాదు..నిజ జీవితంలోనూ మరుపురాని క్షణాలను ఆస్వాదించబోతున్నారు ఎన్టీఆర్ .2018వ సంవత్సరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి గర్భవతిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు నాలుగేళ్ల కుమారుడు అభయ్ రామ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణతి రెండో సంతానానికి తల్లి కానుందని సమచారం. మే నెలలో వీరి కుటుంబంలోకి మరొకరు రాబోతున్నట్లు సోషల్‌మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. అంతేకాదు ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది. ఈ చిత్రానికి అనంతరం రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే మల్టీస్టారర్‌లోనూ నటించబోతున్నారు. రాజమౌళి, త్రివిక్రమ్‌లతో వరుస హిట్స్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న జూనియర్ ఎన్టీఆర్‌కు రెండో సంతానం కలుగనుందని తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat