Home / Uncategorized / తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ముందుకు వ‌చ్చిన వైద్య దిగ్గ‌జం

తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ముందుకు వ‌చ్చిన వైద్య దిగ్గ‌జం

ప్రపంచ ప్ర‌ఖ్యాత బయో ఏషియా సదస్సు రెండో రోజే అదిరింది. ఈ స‌ద్సులో భాగంగా రెండో రోజు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామరావు పలువురు ఫార్మా దిగ్గజాలతో సమావేశం అయ్యారు. నోవార్టీస్, బయోకాన్, మెర్క్, డెటాయిట్, జీఈ కంపెనీల సియివోలు, సీనియర్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. దీంతోపాటు థాయ్‌లండ్‌ వాణిజ్య ఉపమంత్రి, ఇటాలియన్ కాన్సుల్ జనరళ్లతో సమావేశం అయ్యారు.

see also :సూపర్ స్టార్ రజనీ అభిమానులకు గుడ్ న్యూస్….

బయోటెక్నాలజీ దిగ్గజం బయోటెక్ నగరంలో నూతన యూనిట్ ప్రారంభించనుంది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న యూనిట్ ను మరింత విస్తరించనుంది. ఈరోజు హెచ్ ఐఐసిలో మంత్రి కెటి రామారావు ఈరోజు బయోకాన్ యండి కిరణ్ మజుందార్ షాతో సమావేశం అయ్యారు.

see also :కమల్ ,రజనీ రహస్య భేటీ …!

జినోమ్ వ్యాలీలో బయోకాన్ నూతన అర్ అండ్ డి సెంటర్ ను ఎర్పాటు చేస్తున్నట్లు అమె మంత్రికి తెలిపారు. తమ అనుబంద కంపెనీ అయిన సింజెన్ ద్వారా ఈ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 1000 హైస్కిల్స్డ్ ఉద్యోగాలు వస్తాయన్నారు. దీంతోపాటు బయోకాన్లోని సిబ్బందిని రెట్టింపు చేస్తామని తెలిపారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అందిస్తామని అమె మంత్రికి తెలిపారు. బయోకాన్ నూతన యూనిట్ ఏర్పాటును స్వాగతించిన మంత్రి, కిరన్ మజుందార్ కు ధ‌న్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తరపున టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో మంత్రి చేస్తున్న కార్యక్రమాలకు అభినందనలు తెలిపారు. ఫార్మాసిటీ ఎర్పాటు గురించి మంత్రి వివరించారు. భవిష్యత్తు విస్తరణకు ఫార్మాసిటీని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat