Home / ANDHRAPRADESH / చంద్ర‌బాబు రూ.3 ల‌క్ష‌లా 30వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన బీజేపీ నేత‌..!!

చంద్ర‌బాబు రూ.3 ల‌క్ష‌లా 30వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన బీజేపీ నేత‌..!!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, త‌న పార్ట‌న‌ర్‌  ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి కేంద్రం ఇచ్చిన నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించి ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఏపీ బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్‌రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ ఓ ప్ర‌ముఖ ఛానెల్ నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్ర‌త్యేక హోదాపై నిర్వ‌హించిన డిబేట్‌లో పాల్గొన్న ఏపీ బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విడిపోయేట‌ప్పుడు ఏపీ అప్పు రూ.96వేల కోట్లు ఉంటే.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఏపీ అప్పులు ఒక్క‌సారిగా 2 ల‌క్ష‌లా 20 వేల కోట్ల 434 కోట్లు పెరిగింద‌న్నారు. ఈ లెక్క గ‌త డిసెంబ‌ర్ వ‌ర‌కేన‌ని, జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రిలో ఇంకెంత అప్పు చేశారోనంటూ అనుమానం వ్య‌క్తం చేశారు.

see also : చంద్రబాబు జీవితచరిత్ర ఆధారంగా బయోపిక్ …టీజర్ విడుదల …!

see also : ప్ర‌త్యేక హోదా ఛాంపియ‌న్ చ‌ంద్ర‌బాబా..? జ‌గ‌నా..?

నెల్లూరులోనే మ‌రుగుదొడ్లు నిర్మిస్తామంటూ టీడీపీ నేత‌లు రూ.100 కోట్ల అవినీతికి పాల్ప‌డ్డార‌న్నారు. అలాగే, నీరు చెట్టు నిధులు రూ.500 కోట్ల‌ను స్వాహా చేశార‌న్నారు. ఇందులో నెల్లూరు టీడీపీ నేత‌లది, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుల వాటా ఎంతో తేలాల్సి ఉంద‌న్నారు. అలాగే, పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో చంద్ర‌బాబు ల‌క్ష‌ల కోట్ల అవినీతికి పాల్ప‌డ్డ విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలిసిందేన‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మోడీ స‌ర్కార్ ప్ర‌త్యేక హోదాతో స‌మానంగా రూ.3 ల‌క్ష‌లా 30 వేల కోట్లు ఇస్తే.. ఆ నిధుల‌న్నింటినీ చంద్ర‌బాబు స‌ర్కార్ ఎలా ఖ‌ర్చు చేసిందో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌న్నారు.

see also : వైసీపీలోకి జాతీయ అవార్డు గ్రహీత సీనియర్ నటి …!

see also : చంద్ర‌బాబుకు బిగుస్తున్న ఉచ్చు: ఓటుకు నోటు కేసులో మ‌రో సంచ‌ల‌నం..!!

డిబేట్‌లో పాల్గొన్న రిటైర్ ఉద్యోగా మాట్లాడుడుతూ..ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా పాల‌న జ‌రుగుతోంద‌న్నారు. అవినీతే ధ్యేయంగా చంద్ర‌బాబు త‌న పాల‌న‌ను కొన‌సాగిస్తున్నార‌న్నారు. చంద్ర‌బాబుకు ద‌మ్ముంటే పోల‌వ‌రం, డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు, ఇలా చంద్ర‌బాబు స‌ర్కార్ సంక్షేమ ప‌థ‌కాలంటూ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలకు ఖ‌ర్చుపెట్టిన నిధుల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసే ద‌మ్ము ఉందా..? అంటూ ప్ర‌శ్నించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat