Home / JOBS / 13,694 తెలంగాణ ఆర్.ఆర్.బి.అభ్యర్థులకు చేయూత

13,694 తెలంగాణ ఆర్.ఆర్.బి.అభ్యర్థులకు చేయూత

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు(ఆర్.ఆర్.బి) భర్తీ చేస్తున్న లక్షకు పైగా ఉద్యోగాల్లో సిక్రింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్ కు 13,694 పోస్టులు లభించాయని టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి వెళ్లడించారు. ఈ ఉద్యోగాలను పొందేందుకు అధిక అవకాశాలున్నతెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ అందించాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారని సీఈవో తెలిపారు.

see also : కరీంనగర్ సాక్షిగా రైతాంగానికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…

టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి సోమవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు లోకో పైలట్, టెక్నిషియన్స్ మరియు గ్రూప్-డి విభాగాల్లో సుమారు 1,07,082 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని, అందులో సికింద్రాబాద్ జోన్ కు 13,694 ఉద్యోగాలున్నాయని శైలేష్ రెడ్డి తెలిపారు. ఇవే కాకుండా రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఓపెన్ కేటగిరిలో ఇతర జోన్లలో 93,388 ఉద్యోగాలున్నాయన్నారు.

see also :కిష‌న్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్‌…పాకిస్తాన్‌పై డౌట్

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ద్వార భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో సికింద్రాబాద్ జోన్ కు సంబందించిన 13,694 ఖాళీలకు తెలంగాణ యువతను సిద్దం చేసేందుకు టి-సాట్ ప్రత్యేక శిక్షణ అందించాలని రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు సూచించారని శైలేష్ రెడ్డి తెలిపారు. మారు మూల ప్రాంత, పేద విద్యార్థులకు సహాయపడేందుకు అనుభవం కలిగిన సిబ్బందిచే పోటీ పరీక్షల పాఠ్యాంశాలు బోధించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. మంత్రి గారి సూచనల మేరకు టి-సాట్ తోలుత ఈ నెల 27వ తేది మంగళవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ద్వార అవగాహన కార్యక్రమాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఆర్.ఆర్.బి భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో లోకో పైలెట్ 3,273, టెక్నీషియన్స్ 3,898, గ్రూప్-డి లో 6,323 ఉద్యోగాలున్నాయని, వీటికి టెన్త్, ఇంటర్, ఐటిఐ అభ్యర్థులకే ఎక్కువ అవశాలున్నాయని సీఈవో వివరించారు.

see also : రాహుల్ కు మద్దతు ఇచ్చిన మంత్రి కేటీఆర్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat