నష్టాలతో ముగిసిన మార్కెట్లు..! – Dharuvu
Breaking News
Home / BUSINESS / నష్టాలతో ముగిసిన మార్కెట్లు..!

నష్టాలతో ముగిసిన మార్కెట్లు..!

సోమవారం ఇంటర్నేషనల్ మార్కెట్ల ఉత్సాహంతో లాభాలతో ముగిసిన మార్కెట్లు నేడు మంగళవారం మాత్రం నష్టాలతో ముగిశాయి.మంగళవారం ఉదయం లాభాలతో మొదలైన సూచీ సాయంత్రం అయ్యే సరికి నష్టాలను చవిచూసాయి.బీఎస్ఈ సెన్సెక్స్ తొంబై తొమ్మిది పాయింట్లను నష్టపోయి ముప్పై మూడు వేల మూడు వందల నలబై ఆరు పాయింట్ల దగ్గర ముగిసింది.

నిఫ్టీ మాత్రం ఇరవై ఎనిమిది పాయింట్ల నష్టంతో పదివేల ఐదు వందల యాబై నాలుగు పాయింట్ల దగ్గర చేరింది.అయితే రూపాయి విలువ డాలరుతో మరింత పడిపోయి అరవై నాలుగు రూపాయల తొంబై మూడు పైసల దగ్గర కొనసాగుతుంది.ఐడియా సెల్యూలార్ ,డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ,భారతి ఎయిర్టెల్ ,ఎన్టీపీసీ ,హీరో మోటో కార్స్ తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి.అంబుజా సిమెంట్,యాక్సిస్ బ్యాంకు,ఎస్పీఐ ,సన్ ఫార్మా,కోల్ ఇండియా తదితర కంపెనీలు నష్టాలను చవిచూసాయి ..