బోయింగ్‌ విడిభాగాల తయారీకి రంగం సిద్ధం..! – Dharuvu
Breaking News
Home / TECHNOLOGY / బోయింగ్‌ విడిభాగాల తయారీకి రంగం సిద్ధం..!

బోయింగ్‌ విడిభాగాల తయారీకి రంగం సిద్ధం..!

తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన బోయింగ్‌ విమాన విడిభాగాల తయారీ కేంద్రం సిద్ధమైంది. రేపు ( గురువారం ) రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వైమానిక ఆర్థిక మండలిలో బోయింగ్‌ విమాన విడిభాగాల తయారీ కేంద్రానికి 2016 జూన్‌ 18న అప్పటి రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ శంకుస్థాపన చేశారు.

see also :పట్టణ ప్రాంతాల్లో కూడా భూ రికార్డుల ప్రక్షాళన..కేటీఆర్

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, బోయింగ్‌ సంస్థలు కలిసి టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ పేరిట ఉమ్మడి సంస్థను ఏర్పాటుచేసి దాని ఆధ్వర్యంలో వైమానిక సెజ్‌లో 13 ఎకరాల్లో రూ.200 కోట్ల వ్యయంతో దీనిని చేపట్టి నిర్మాణం పూర్తి చేశారు. బోయింగ్‌ ఏహెచ్‌-64 విమానాల విడిభాగాలకు తోడు అపాచీ హెలికాప్టర్లను ఇందులో తయారు చేస్తారు. అమెరికా సహా 15 దేశాల్లో వీటికి బాగా డిమాండ్‌ ఉంది. ఇప్పటికే ఆయా దేశాలు విమానాల విడిభాగాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి.

see also :అడ్డంగా బుక్కైన చంద్ర‌బాబు..! రూ.3,300 కోట్ల లెక్క‌ల‌పై త‌డ‌బాటు..!!

see also : అభివృద్దిని చూసి ఓర్వలేకనే విపక్షాల విమర్శలు..ఎమ్మెల్సీ పల్లా