హోళీ రోజు ..ఎయిర్ టెల్ బిగ్ ఆఫర్..! – Dharuvu
Breaking News
Home / BUSINESS / హోళీ రోజు ..ఎయిర్ టెల్ బిగ్ ఆఫర్..!

హోళీ రోజు ..ఎయిర్ టెల్ బిగ్ ఆఫర్..!

దేశంలో ప్రస్తుతం ఉన్న అన్ని టెలికాం కంపెనీ ల మధ్య తీవ్ర పోటి ఉంది.ఈపోటికి ప్రధాన కారణం జియో నెట్ వర్క్ .జియో రాకతో దేశంలో ఉన్న అన్ని టెలికాం సంస్థలు వినియోగదారులకు మంచి మంచి ఆఫర్స్ ను ప్రకటిస్తుంది.

అందులో భాగంగా తాజాగా దేశంలోనే అతి పెద్ద టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్టెల్ సంస్థ తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సూపర్ ఆఫర్ ను ప్రకటించింది.

అందులో భాగంగా దాదాపు ఆరు నెలలకు సరిపడా కేవలం తొమ్మిది వందల తొంబై ఐదు రూపాయలకే నెలకు ఒక జీబీ 3జీ ,4 జీ డేటా తో పాటుగా రోజుకి వంద మెసేజ్ లు ,ఆన్ లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ ,రోమింగ్ కాల్స్ ను అందజేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.అయితే ఈ ఆఫర్ లో నెలకు ఒక జీబీ డేటా రావడమే వినియోగదారులకు మైనస్ అని వ్యాఖ్యానిస్తున్నారు మార్కెట్ ఎక్స్ పర్ట్శ్..