Home / Uncategorized / హైద‌రాబాద్ సిగలో మ‌రో ప్ర‌త్యేక‌త‌…టాటా బోయింగ్ కేంద్రం ప్రారంభం

హైద‌రాబాద్ సిగలో మ‌రో ప్ర‌త్యేక‌త‌…టాటా బోయింగ్ కేంద్రం ప్రారంభం

ఏరోస్పేస్ రంగంలో త‌నదైన ముద్ర వేసుకునేందుకు తెలంగాణ మ‌రో ముంద‌డుగు వేసింద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వైమానిక రంగానికి చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఆదిభట్లలో ఏర్పాటైన టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ నేడు  కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, టాటా సన్స్ ఎమరిటీస్ ఛైర్మన్ రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్‌తో క‌లిసి మంత్రి ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో ఏరోస్పేస్ విడిభాగాల తయారీ కంపెనీలు ఉన్నాయ‌న్నారు. ఈ జాబితాలోకి టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ చేర‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు.

see also: ల‌క్షా 50 వేల కోట్ల రూపాయ‌ల అవినీతిని ఆధారాల‌తో స‌హా తేల్చేశారు..!!

ఇప్పటికే హైదరాబాద్ లో ఏరోస్పేస్ విడిభాగాల తయారీ కంపెనీలు ఉన్నాయ‌ని, ఇపుడు బోయింగ్ ఫెసిలిటీ సెంటర్ కూడా ప్రారంభం కావ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. ఇక్కడ అపాచీ హెలికాప్టర్స్ కి విడిభాగాల తయారు కానున్నాయని వివ‌రించారు. హైదరాబాద్ లో డిఫెన్స్ మనుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ బాగుందని తెలంగాణలో స్కిల్ల్డ్ పీపుల్ కూడా ఉన్నారని మంత్రి కేటీఆర్ వివ‌రించారు. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. హైదరాబాద్ గత మూడేళ్లుగా బెస్ట్ క్వాలిటీ లివింగ్ సిటీ గా ఉందని తెలిపారు. ఇన్నోవేషన్ కి డెస్టినషన్ గా తెలంగాణ మారిందన్నారు. డిఫెన్స్ మనుఫ్యాక్చరింగ్ కారిడార్ ని తెలంగాణ లో ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖా మంత్రిని కోరుతున్న‌ట్లు మంత్రి కేటీఆర్ మ‌రోమారు తెలిపారు.

see also :ఎవరు చేశారు ..?.ఏమి చేశారు ..!

కాగా, తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వైమానిక సెజ్‌లో విమాన విభాగాల తయారీ కేంద్రానికి 2016 జూన్ 18న అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, టాటా గ్రూపుల చైర్మన్ రతన్ టాటా, తెలంగాణ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, బోయింగ్ సంస్థలు కలిసి టాటా బోయింగ్ ఏరో స్పేస్ లిమిటెడ్ ఉమ్మడి సంస్థను ఏర్పాటుచేశాయి. దీని ఆధ్వర్యంలో మైమానిక సెజ్‌లో 13 ఎకరాల్లో రూ.200 కోట్లతో పరిశ్రమను నిర్మించాయి. బోయింగ్ ఏహెచ్ 64 విమానాల విడిభాగాలకుతోడు అపాచీ హెలికాప్టర్లను ఇందులో తయారుచేయనున్నారు. వీటికి అమెరికా సహా 15 దేశాల్లో బాగా డిమాండ్ ఉంది.

see also :చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల పార్ట‌న‌ర్‌షిప్‌ను ఆధారాల‌తో స‌హా ఏకిపారేశాడు..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat