Home / POLITICS / 100% రాజ్యసభ కు సంతోష్ అర్హుడే..!

100% రాజ్యసభ కు సంతోష్ అర్హుడే..!

వారం రోజుల్లో మా ఇంట్లో చెల్లి పెళ్లి..
నాయ‌న ఒక‌టే హైరానా ప‌డుతున్న‌డు..
అక్క‌కు ఫోన్ చేసినవా బిడ్డా ! బావా, పిల్ల‌లు బ‌య‌లు  దేరిండ్రా క‌నుక్కో..
వంటలోల్లకు మ‌ళ్లోసారి గుర్తుచెయ్యి చిన్నోడా.. టెంటోడు ఏమ‌న్న‌డురా ?..
అయ్య‌గారు నెంబ‌ర్ యాడ‌నో మిస్ప‌యిందిరా.. నీ ద‌గ్గ‌ర ఉన్న‌దారా ?..
మీ అమ్మ వ‌ట్టిగ‌నే ఆగ‌మైత‌ది. ఫంక్ష‌న్ హాల్‌కు తీసుకెళ్లే
పెండ్లి సామాను ముందే స‌ర్దిపెట్టుకోమ‌ని చెప్పు..
నాయ‌న చెప్పుడు తీరు చూసి, ప‌క్క‌నే ఉన్న బాబాయ్‌..
గందుకే అన్న‌రే.. పెండ్లి చేసి చూడు, ఇల్లు క‌ట్టి చూడు అని
నిజ‌మే.. ముందుబ‌డి ఒక పెండ్లి చేస్తే, ఒక ఇల్లు క‌ట్టిస్తే..
అందులోని సాద‌క‌బాధ‌కాలు తెలుస్తాయ్ !!


టీఆర్ఎస్ పార్టీని స్థాపించాక పెండ్లి లాంటి స‌భ‌లు, స‌మావేశాలు
ఎన్ని ఏర్పాటు చేసిందో తెలుసా ?
ఇల్లులాంటి ఎన్ని కార్య‌క్ర‌మాలు నిర్మించిందో తెలుసా ?
గ‌డిచిన 17 ఏళ్ల‌లో వేల సంఖ్య‌లో స‌భ‌లు, స‌మావేశాఉల‌, కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది.
ఇందుకోసం ఎంతో మేధోమ‌త‌నం చేసింది. వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు గురైంది.
బ‌య‌టికి క‌నిపించేది వేరు.. లోప‌ల జ‌రిగేది వేరు..
అలా టీఆర్ఎస్‌కి సంబంధించి తెర వెనుక జ‌రిగిన వేల క్ర‌తువుల్లో
2004 నుంచి  జోగిన‌ప‌ల్లి సంతోష్‌కుమార్‌దే కీల‌క పాత్ర‌.


మ‌నం ఒక్క రోజు నిద్ర లేక‌పోతేనే నీర‌సించిపోతాం.
టైంకి టిఫిన్‌, భోజ‌నం చేయ‌క‌పోతే డీలాప‌డ‌తాం.
గ‌ట్టిగా ఓ గంట నిల్చొని ఉండ‌మంటే, అబ్బా..! కాళ్లు లాగేస్తాయంటాం.
ఎప్పుడైనా అనుకోకుండా నాలుగు రోజులు కుటుంబానికి దూరంగా ఉంటేనే,
భార్యా పిల్ల‌ల వైపు మ‌సు పీకుతుంది.
మ‌నిషి ముందు ఒక‌లా, వెనుక మ‌రొక‌లా ఉండొద్ద‌ని గిరి గీస్తే
నోటిని అదుపులో పెట్టుకోలేక గింజుకుంటాం.
వీట‌న్నింటికి అతీతంగా గ‌డిపిన వ్య‌క్తి సంతోష్‌కుమార్‌.
ఒక్క రోజు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 14 ఏళ్లు !!
ఇలా ఉండ‌టం ఎవ‌రికి సాధ్యం ?


తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మ‌కారుడు, అంత‌కంటే మించి
మ‌హోన్న‌త‌మైన మాన‌వ‌తా వాది అయిన కేసీఆర్ వెన్నంటి ఉన్నాన‌నే
ఒకే ఒక్క ఆత్మ సంతృప్తితో త‌న విలువైన స‌మ‌యాన్ని, య‌వ్వ‌నాన్ని,
వ్య‌క్తిగ‌త జీవితాన్ని త్యాగం చేసిన ఉన్నత విద్యావంతుడు సంతోష్‌కుమార్‌.
యుద్ధంలో ప్ర‌త్య‌క్షంగా పాల్గొంటేనే సైనికుడా ?
శ‌త్రువుపై యుద్ధం చేయ‌టానికి కావాల్సిన స‌ర్వ వ‌న‌రుల‌ను
ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌కూర్చటంలో మెరుగైన భాగ‌స్వామి సైనికుడితో స‌మానం కాదా ?
కేసీఆర్‌కు సేవ‌కుడిగా.. స‌హాయ‌కుడిగా.. అంత‌రంగికుడిగా..
రాష్ట్ర వ్యాప్తంగా  ఉన్న టీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు, అధినేత‌కు మ‌ధ్య‌
సంధాన‌క‌ర్త‌గా.. ఇలా ఎన్నో పాత్ర‌ల్లో లీన‌మ‌య్యాడు.
ప్ర‌తి ప‌నిని క‌ష్టంగా కాకుండా, ఇష్టంగా చేశాడు.
రాత్రి, ప‌గ‌లు తేడా లేకుండా విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న‌ప్ప‌టికీ, ఏనాడు
ముఖంగా చిరున‌వ్వు చెర‌గ‌నివ్వ‌లేదు.
ఎవ‌రినీ పల్లెత్తు మాట అన‌లేదు.
స‌వాల‌క్ష కార‌ణాల‌తో అధినేత కేసీఆర్‌ను క‌ల‌వ‌లేక‌, ఆయ‌న‌ను ఏమీ అన‌లేక‌, త‌న‌ను
ప‌ట్టుకొని ఎంతో మంది పార్టీ నేత‌లు అన‌రాని మాట‌లు అన్న‌ప్ప‌టికీ, సహ‌నం కోల్పోలేదు.
ఎంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైన‌ప్ప‌టికీ, భావోద్వేగాలు నియంత్రించుకున్నాడు.
రాగ‌వ్వేషాల‌కు అతీతంగా ప‌నిచేశాడు.


మొద‌టి నుంచి అధినేత మాట‌నే త‌న మాట‌గా వినిపించాడు.
ఆయ‌న గీసిన గీత ఏనాడూ దాట‌లేదు.
స‌మ‌కాలీన ప‌రిస్తితుల్లో ఇలా ఎవ‌రైనా ఉంటారా ?
కేసీఆర్‌ను సంతోష్‌ను వేరుగా చూడ‌లేం.
టీఆర్ఎస్ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాలు ద‌గ్గ‌రి నుంచి చూసిన వారికి ఇది బాగా తెలుసు.
అప్పుడు తెలంగాణ సాధ‌న‌కు,
ఇప్పుడు ప్ర‌భుత్వ పాల‌న‌కు కేసీఆరే ఇంధ‌నం.
ఆ ఇంధ‌నంలో వేరుగా క‌నిపించ‌కుండా క‌లిసిపోయిన
ఉత్ప్రేర‌క‌మే.. సంతోష్‌కుమార్‌
టీఆర్ఎస్  తరపున  రాజ్య‌స‌భ సీటును ద‌క్కించుకోవ‌టానికి
ఇంత‌కంటే పెద్ద అర్హ‌త ఏమైనా ఉంటుందా ?

100% రాజ్యసభ కు సంతోష్ అర్హుడే..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat