Home / TELANGANA / సంతోష్ వ్య‌వ‌హార‌శైలి…ఆయ‌న‌కు మాత్ర‌మే ఉన్న ప్ర‌త్యేక‌త‌లివి

సంతోష్ వ్య‌వ‌హార‌శైలి…ఆయ‌న‌కు మాత్ర‌మే ఉన్న ప్ర‌త్యేక‌త‌లివి

టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ముందు పార్టీ శ్రేణులు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌తిపాద‌న పెడుతున్నారు. స‌హ‌జంగా పార్టీ నేత‌లు గులాబీ ర‌థసార‌థి నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటారు. అయితే ఈ ద‌ఫా కీల‌క‌మైన ప్ర‌తిపాద‌న ఒక‌టి బ‌లంగా కేసీఆర్ ముందుంచార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే పార్టీ యువ‌నేత‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జోగిన‌ప‌ల్లి సంతోష్‌రావుకు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం క‌ట్ట‌బెట్ట‌డం. సంత‌న్న‌గా పార్టీ నేత‌లంద‌రికీ సుప‌రిచితుడు….అన్నా అంటే నేనున్నా అనే సంత‌న్న‌కు ఈ ప‌ద‌వి కోసం తాము డిమాండ్ చేయ‌డం వెనుక ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని పార్టీ నాయ‌కులు అంటున్నారు.

see also :100% రాజ్యసభ కు సంతోష్ అర్హుడే..!

స్వ‌రాష్ట్రం కోసం గ‌ళం విప్పిన నాటి నుంచి పోరాట యోధుడైన కేసీఆర్ వెంట సంత‌న్న నీడ‌లా ఉన్నార‌ని పార్టీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రసాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీక్ష చేసిన సందర్భంలోనూ.. జైల్లోనూ, ఆస్పత్రిలో ఉన్న సమయంలోనూ సంతోష్‌ అనుక్షణం ఆయనకు కంటికిరెప్పలా వ్యవహరించారని కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనూ వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న సంతోష్‌.. అధినేత కోసం నిరంతరం తపించేవారని, ఆయన అప్పగించిన బాధ్యతలు నిబద్దతతో పూర్తి చేసేవారని ప్ర‌స్తావిస్తున్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో పార్టీ నేత‌ల‌కు సంబంధించిన అభిప్రాయాల‌న్నింటినీ గులాబీ ద‌ళ‌ప‌తికి చేర‌వేయ‌డంలో సంత‌న్న‌ది కీల‌క పాత్ర అని వివ‌రిస్తున్నారు.

see also :సంతోష్ కు రాజ్య‌స‌భ‌..కామెడీ పాల‌వుతున్న కాంగ్రెస్‌..!

ఇక ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ సంత‌న్న వ్య‌వ‌హ‌రించిన తీరు హుందాగా ఉంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. అధికారపీఠానికి దగ్గరగా ఉన్నామనే భావన లేకుండా అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరించడం, కీలక బాధ్యతలను సౌమ్యంగా పూర్తిచేయడం ఆయ‌న ప్ర‌త్యేక‌త అని పేర్కొంటున్నారు. చిన్న ఆరోపణ కూడా ఎదురుకాకుండా ప‌నిచేసుకుంటూ ముందుకు సాగ‌డం సంత‌న్న‌కే సాధ్య‌మ‌ని వివ‌రిస్తున్నారు. గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించడం.. ఎంత ఒత్తిడి ఉన్నా చెదరని చిరునవ్వుతోనే పని పూర్తిచేయడం సంతోష్‌కు మాత్రమే సాధ్యమైన విషయమని పార్టీ ముఖ్యనేతలు అంటున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో నిర్విరామంగా పనిచేసే సంతోష్‌కు రాజ్యసభ ఇవ్వాల్సిందేనన్న ఒత్తిళ్ళు అధిష్టానంపై బలంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈవిష‌యాల‌పై అవ‌గాహ‌న లేని వారే త‌మ నోటి దుర‌ద‌ను తీర్చుకునేందుకు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని పేర్కొంటున్నారు.

see also :తెలంగాణ టూరిజం పై సీఎం కేసీఆర్ దృష్టి

see also : ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat