Home / TELANGANA / రాజ్యసభ సభ్యత్వానికి.. సంతోష్ కచ్చితంగా అర్హుడే!

రాజ్యసభ సభ్యత్వానికి.. సంతోష్ కచ్చితంగా అర్హుడే!

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు? అన్న మాటను చాలా మంది వినే ఉంటారు. కానీ.. ఆ మాటను అక్షర సత్యం చేసి చూపిన వ్యక్తి.. టీఆర్ఎస్ నాయకుడు సంతోష్ రావు. జనాన్ని ప్రభావితం చేసేందుకు కేసీఆర్ లాంటి మహా నాయకులు ముందుండి కొట్లాడుతుంటే.. వారికి భూమిక ఏర్పాటు చేయడంలో.. సంతోష్ రావు లాంటి వాళ్లే కూలీలుగా మారుతుంటారు. అలా.. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి.. ఏ మాత్రం పేరు, సంపద ఆశించకుండా.. కేసీఆర్ మాటే వేద వాక్కుగా నడిచిన నాయకుడు.. సంతోష్ రావు.ఆయనపై ఎంతో మంది విమర్శలు చేయొచ్చు. రాజ్యసభ సభ్యుడిగా సంతోష్ రావు అర్హుడేనా అని ప్రశ్నించొచ్చు. కానీ.. దానికి ఒకే ఒక సమాధానం… తెలంగాణ ఉద్యమంలో అలుపెరగకుండా అధినేత కేసీఆర్ చేసిన సూచనలను తూచ తప్పకుండా పాటించిన సంతోష్ రావు వ్యక్తిత్వం. నమ్మిన ఆశయానికి కట్టుబడ్డారు. నాయకుడి సూచనలు పాటించారు. ప్రత్యక్షంగా ఉద్యమంలో అధినేత పోరాడుతుంటే.. పరోక్షంగా తాను కూడా అందులో కీలక భూమిక పోషించారు.

see also :అసలు ఎవరీ జోగినపల్లి సంతోష్ కుమార్..

ఒకటి కాదు. రెండు కాదు. టీఆర్ఎస్ ఏర్పడి ఇప్పటికి 17 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ క్రతువులోనే కాదు.. రాష్ట్రాన్ని సాధించిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి యజ్ఞంలోనూ సంతోష్ రావుది కీలక పాత్ర. ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ ను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన వేల సంఖ్యలో సభలు.. సమావేశాలు.. మేధావులను ఒక వేదికపైకి తీసుకురావడాలు.. ఇలా చెబుతూ పోతే.. టీఆర్ఎస్ ప్రస్థానంలో సంతోష్ రావుకు ప్రత్యేక అధ్యాయం కూడా కేటాయించాల్సిన అవసరం చాలా ఉంది.ఇన్నాళ్లూ.. లక్ష్య సాధన దిశగా కేసీఆర్ పయనిస్తే.. ఆ సాధనకు అవసరమైన భూమికలన్నీ సంతోష్ కుమార్ పరుచుకుంటూ వెళ్లారు. అడుగడుగూ.. అధినేత కేసీఆర్ మార్గదర్శనాన్నే నమ్ముకుని.. రాష్ట్ర సాధనలో సమిధగా మారారు. ఉద్యమ కాలంలో కుటుంబానికి దూరంగా ఉన్నారు. అయిన వాళ్లకు దూరంగా ఉన్నారు. సంతోషాలను వదులుకున్నారు. ఆడంబరాలు వద్దనుకున్నారు. నమ్మిన తెలంగాణ సిద్ధాంతం కోసం సర్వస్వాన్ని ధారపోశారు.

see also :సంతోష్ వ్య‌వ‌హార‌శైలి…ఆయ‌న‌కు మాత్ర‌మే ఉన్న ప్ర‌త్యేక‌త‌లివి

ఇన్నాళ్లుగా టీఆర్ఎస్ కోసమే పని చేసిన సంతోష్ రావుకు.. రాజ్యసభ సభ్యత్వం ఇస్తే తప్పేంటి? అందులో తప్పుబట్టేందుకు ఏం ఉంది? ఏ కోశానా కూడా ఈ వ్యవహారంలో ఎలాంటి తప్పు కనిపించడం లేదు. పైగా.. రాజ్యసభ సభ్యత్వం ఈ పాటికే సంతోష్ రావుకు ఇచ్చి ఉండాల్సిందన్న మాట కూడా బలంగా వినిపిస్తోంది. ఉద్యమకారులకు పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే చాలా మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవించారు.ఇప్పుడు సంతోష్ రావు లాంటి అసలు సిసలైన పోరాటయోధుడికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే.. ఎంత మాత్రం తప్పు లేదని టీఆర్ఎస్ నేతలే కాదు.. ప్రజలు కూడా తేల్చి చెబుతున్నారు. సంతోష్ ను రాజ్యసభకు పంపిస్తే.. ఉద్యమాన్ని కూడా గౌరవించుకున్నట్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే.. పదిహేడేళ్లుగా ప్రజల్లో కలిసి పోతూ.. టీఆర్ఎస్ జెండాను మోస్తున్న సంతోష్ కు.. జనం సమస్యలపై ఉన్న పట్టు.. రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీసేందుకూ పనికొస్తుందని.. పార్లమెంట్ సభ్యుడిగా సంతోష్ రాణిస్తాడన్న నమ్మకం ఉందనీ.. అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు.

see also :సంతోష్ కు రాజ్య‌స‌భ‌..కామెడీ పాల‌వుతున్న కాంగ్రెస్‌..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat