Home / ANDHRAPRADESH / వైసీపీ కార్యాలయం ముందు వందలాది మంది పోలీసులు …కానీ టీడీపీ కార్యాలయం వద్ద ఎందుకు పెట్టలేదో తెలుసా..?

వైసీపీ కార్యాలయం ముందు వందలాది మంది పోలీసులు …కానీ టీడీపీ కార్యాలయం వద్ద ఎందుకు పెట్టలేదో తెలుసా..?

కడప జిల్లా పులివెందుల అభివృద్ధిపై చర్చకైనా, రచ్చకైనా సిద్ధమని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం అన్నంత పనీ చేశారు. అధికార బలంతో రౌడీల్లా రెచ్చిపోయారు. పూల అంగళ్ల సర్కిల్‌ వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.ఫిబ్రవరి 28న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. అయితే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించి ‘చర్చకు నేను సిద్ధం. ఎప్పుడు.. ఎక్కడికి పిలిచినా వస్తా’ అంటూ మార్చి 1న ప్రతి సవాల్‌ విసిరారు. పులివెందులలోని పూల అంగళ్ల సర్కిల్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు చర్చకు రావాలని సతీష్‌రెడ్డి అన్నారు.

Posted by Manoj Reddy Puli on Sunday, 4 March 2018

 పులివెందుల రాజకీయం వేడెక్కడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో ఆదివారం ఉదయం నుంచే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అర్థవంతమైన చర్చ జరిగేందుకు సహకరించాలని ఎంపీ అవినాష్‌రెడ్డి పోలీసులను కోరారు. అయినా పోలీసులు పట్టించుకోకుండా ఎంపీని అరెస్టు చేసి తరలించేందుకు జీపు వద్దకు తీసుకురాగా.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు వెనుతిరిగారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ… అందరూ సంయమనం పాటించాలని కోరారు. చట్టాన్ని, పోలీసులను గౌరవించాలని, సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే ఉందామని అన్నారు.

టీడీపీ నేతలు రెచ్చిపోయి..రౌడిల్లా..
పులివెందులలో చర్చకు బయలుదేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిని వేంపల్లె పోలీసులు మధ్యాహ్నం అరెస్టు చేసి గృహనిర్బంధంలో ఉంచారు. అదే సమయంలో పులివెందులలో టీడీపీ నేతలు బీటెక్‌ రవి, రాంగోపాల్‌రెడ్డి తమ పార్టీ కార్యకర్తలతో కలిసి పూల అంగళ్ల సర్కిల్‌కు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఈలలు, కేకలు వేస్తూ రణరంగం సృష్టించారు. అక్కడున్న వైసీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేయగా.. ఈ దాడిలో ట్రాఫిక్‌ ఎస్‌ఐ చిరంజీవి గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం బాష్పవాయువు ప్రయోగించారు. అయితే రాళ్ల దాడికి దిగిన టీడీపీ నేతలను వదిలేసి వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.వైసీపీ కార్యాలయం ముందు వందలాది మంది పోలీసులు మోహరించారు, కానీ టీడీపీ కార్యాలయం వద్ద ఎందుకు పోలీసులను పెట్టలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు పక్కా ప్రణాళికతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

Posted by Manoj Reddy Puli on Sunday, 4 March 2018

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat