అక్క‌డ అమ్మాయిల‌కు ఇంటి అద్దె బదులుగా సెక్స్..! – Dharuvu
Breaking News
Home / INTERNATIONAL / అక్క‌డ అమ్మాయిల‌కు ఇంటి అద్దె బదులుగా సెక్స్..!

అక్క‌డ అమ్మాయిల‌కు ఇంటి అద్దె బదులుగా సెక్స్..!

అత్యాధునిక దేశాల్లో ఒకటిగా చెప్పుకునే ఇంగ్లండ్ లో.. ఇటీవలి కాలంలో అక్కడి దిన పత్రికల్లో ఈ తరహా ప్రకటనలు కూడా వస్తున్నాయట. మన పత్రికల్లో క్లాసిఫైడ్స్ అంటూ చిన్న యాడ్ లు వస్తాయే.. అలాంటి చోట ఇంగ్లండ్ లో ఈ తరహా ప్రకటనలు వస్తున్నాయట. ఇంటి అద్దె అవసరం లేదు. కాకపోతే మాతో సెక్స్ కు ఒప్పుకోండి చాలు.. ఇదీ కొందరు ఇంటి యజమానుల ప్రతిపాదనలు.. ముఖ్యంగా ఈ తరహా ప్రతిపాదనలు ఒంటరి మహిళలకు ఎదురవుతున్నాయట. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే.. దీనిపై బీబీసీ వార్తా సంస్థ ఏకంగా ఓ డాక్యుమెంటరీయే తీస్తోందట. వాస్తవానికి ఇలాంటి ప్రతిపాదనలు పంపడం.. ప్రకటనలు ఇవ్వడం కూడా నేరాల జాబితాలోకే వస్తాయి.. కానీ ఈ ప్రతిపాదనల గురించి కంప్లయింట్ ఇచ్చే వారు చాలా తక్కువ. ఆ ప్రపోజల్ నచ్చితే ఇంట్లో అద్దెకు చేరిపోవడం.. లేకపోతే.. మౌనంగా అక్కడి నుంచి తప్పుకోవడం. ఇదీ ఇప్పటివరకూ జరుగుతోంది.