గేల్ రికార్డు…! – Dharuvu
Home / SLIDER / గేల్ రికార్డు…!

గేల్ రికార్డు…!

క్రికెట్ లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్ ,వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు.దీంతో వన్డే ల్లో సచిన్ ,ఆమ్లా తర్వాత మొత్తం పదకొండు రకాల జట్టులపై శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డును సొంతం చేస్కున్నాడు.ప్రపంచ కప్ క్యాలిఫయర్స్ లో భాగంగా నిన్న మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన గేల్ తొంబై ఒక్క బంతుల్లో నూట ఇరవై మూడు పరుగులను సాధించాడు.

ఈ ఇన్నింగ్స్ లో పదకొండు సిక్సర్లు ,ఏడు ఫోర్లు ఉన్నాయి.గేల్ దాటికి విండిస్ అరవై పరుగుల తేడాతో గెలుపొందింది.మొత్తం నాలుగు వికెట్ల నష్టానికి మూడు వందల యాబై ఏడు పరుగులు చేయగా యూఏఈ మాత్రం పూర్తీ ఓవర్లను ఆడి ఆరు వికెట్లను కోల్పోయి రెండు వందల తొంబై ఏడు పరుగులు మాత్రమే చేసింది.