రోహిత్ శర్మ చెత్త రికార్డు..! – Dharuvu
Breaking News
Home / SLIDER / రోహిత్ శర్మ చెత్త రికార్డు..!

రోహిత్ శర్మ చెత్త రికార్డు..!

నిదహాస్ ట్రోపీలో భాగంగా మంగళవారం జరిగిన తోలి మ్యాచ్ లో టీం ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఆతిధ్య జట్టు శ్రీలంకపై ఓడిపోయిన సంగతి తెల్సిందే.అయితే ఈ మొక్కోణపు టోర్నీలో టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీకు విశ్రాంతి ఇచ్చి యువ బ్యాట్స్ మెన్ ,ఓపెనర్ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అందించింది.

ఐదు వికెట్లతో తేడాతో ఓడిపోయిన ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ ఒక చెత్త రికార్డును తనఖాతాలో జమచేసుకున్నాడు.అందులో భాగంగా ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత ఆటగాళ్ళ జాబితాలో రోహిత్ అగ్రస్థానం సంపాదించాడు.

దీంతో ఇప్పటివరకి మొత్తం డెబ్బై ఐదు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాడిన రోహిత్ అరవై ఎనిమిది ఇన్నింగ్స్ లో ఐదు సార్లు డకౌటయ్యాడు.అయితే ఇప్పటివరకు భారతతరపున ఏ ఆటగాడు ఇన్ని సార్లు డకౌటవ్వలేదు..