ఎక్కడైనా సరే తమ అభిమాన నటుడి కోసం ఆయన సినిమా విడుదలవుతున్న రోజు కొబ్బరి కాయలు కొట్టడమో..విడుదలైన సినిమా హిట్ అవ్వాలనో ..లేదా తమ అభిమాన హీరోతో కల్సి దిగిన ఫోటోలను పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో చూయించి ధియేటర్ల దగ్గర కట్టడమో ..లేదా అభిమాన హీరో పుట్టిన రోజు నాడు వేడుకలు ఘనంగా ఇష్టమై జరుపుతారు.
లేదా అదే రోజు రక్తదానాలు ..పండ్లు ఫలాలు పంపిణీ చేస్తుంటారు.అంతగా తమ అభిమాన నటుడి కోసం ఏమి చేయడానికి అయిన సిద్ధపడతారు.తాజాగా ముంబాయికి చెందిన నిషి త్రిపాఠి అనే మహిళకు సంజయ్ దత్ అంటే ఎంతో అభిమానం.పోయిన జనవరి నెల 28న తీవ్ర అనారోగ్యంతో మరణించింది.
అయితే ఆమె చనిపోవడానికి ముందు తనపేరు మీద ఉన్న ఆస్తంతా సంజయ్ దత్ పేరు మీద రాసేసింది.అంతే జనవరి 30న బ్యాంకు ఆఫ్ బరోడా సంజయ్ దత్ కు కాల్ చేసి నిషి చనిపోయే ముందు తన ఆస్తిని మీపేరు మీద రాసిపెట్టింది.డిపాజిట్ రూపంలో మీ పేరు మీద డిపాజిట్ చేసింది.వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పడంతో షాకవ్వడం సంజయ్ దత్ వంతైంది.అభిమానం ఉండాలి కానీ మరింతనా అనుకునేలా ఉంది కదా ఈ సంఘటన