Home / SLIDER / కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ కు బలమైన అవకాశాలు..!

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్ కు బలమైన అవకాశాలు..!

భారత దేశాన్ని కాంగ్రెస్ , బీజేపీ ల మూస పాలనకు భిన్నంగా సరికొత్త దిశలో నడిపించే ఒక నాయకుడి అవసరమున్నదనే అభిప్రాయం క్రమంగా బలపడుతున్నది . ఎందుకంటే 70 ఏళ్ళ పాలనలో పార్టీల రంగులు , ప్రధాన మంత్రి కుర్చీలో వ్యక్తులు మారుతున్నరు కాని దేశాన్ని సరైన దిశలో నడిపించే నాయకుడు ఇప్పటి వరకు రాలేదు . ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ పాలనావిధానాలతో పోటీ పడే విధంగా మన దేశ పాలనా విధానంలో ఆశించిన మార్పు రావడం లేదు . దేశాన్ని 40 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ పాలనకు భిన్నంగా బీజేపీ పరిపాలన చేస్తుందని నమ్మిన సగటు భారతీయుడికి నిరాశే మిగిలింది తప్ప దేశ ప్రజలకు ఆశించిన మేలు జరగలేదు . 20 ఏళ్ళ క్రితం అతి కొద్ది కాలం ఉన్న ప్రాంతీయ పార్టీల కూటమి యునైటెడ్ ఫ్రంట్ పాలన కూడా సరైన ఎజెండా లేకపోవడం , సంపూర్ణ మెజార్టీ లేని కారణంగా ప్రజలకు పెద్దగా మేలు జరగలేదు . పైగా అప్పుడు పాలనా వ్యవహారాలను సింప్లిఫై చేయగలిగే టెక్నాలజీ కానీ , చైతన్యం కానీ ఇంతగా లేవు . మొబైల్ , టీవీ , సోషల్ మీడియా లాంటి ప్రజాభిప్రాయాన్ని తక్షణమే ప్రతిబింబించే సాధనాలు కూడా అందుబాటులో లేవు . ప్రపంచ పరిణామాలకు, భారత దేశ అవసరాలకు అనుగుణంగా స్పాంటేనియస్ గా నిర్ణయాలు తీసుకునే ఒక సమర్ధ నాయకుడు … ఆయన వెనుక ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి ఇప్పుడు ఖచ్చితంగా అవసరం . సరిగ్గా ఈ సమయంలోనే ఈ దేశాన్ని అమెరికా , చైనా తరహాలో ముందుకు తీసుకెళ్లే పాలనా వ్యవస్థ అవసరమని తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు . ఆయన ప్రకటన ఒకే సారి దేశ రాజకీయ పక్షాలను , విశ్లేషకులను ఆశ్చర్యపర్చినా … ఇప్పుడు కాస్త లోతుగా ఆలోచించడానికి కారణమవుతున్నది . ఎందుకంటే ఎంతసేపూ కుంభకోణాలకు పాల్పడే పార్టీ కంటే కాస్త అవినీతి తక్కువగా ఉండే పార్టీ అని , పథకాల పేర్లు మార్చి అదే పాలనను అందించే పార్టీకి , ఇంతకు ముందున్న పార్టీ మీద వ్యతిరేకతతో ఇంకో పార్టీకి పట్టం కట్టడం తప్ప ఇంకా కొత్తగా ఆలోచించడం లేదు .

మన పక్కనున్న చైనా మన కంటే వంద రెట్ల వేగంతో విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతుంటే ఇంకా మనం పాలనా వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేసుకోలేని స్థితిలోనే ఉండిపోతున్నాం . స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు పూర్తయినా ఇంకా దేశ ప్రజలకు పూర్తి స్థాయిలో తాగు నీరు , విద్యుత్తు అందించుకోలేని స్థితిలో ఉన్నం . అందుకే “ఇంకా ఎన్నాళ్ళు అమెరికా , చైనా ల గొప్పతనం గురించి చెప్పుకుందాం ? దేశంలో ఉన్న 70 ,000 ల టీ ఎం సి ల నదీ జలాలను రైతులకు పూర్తి స్థాయిలో ఎందుకు అందించలేకపోతున్నాం ? అని ముఖ్యమంత్రి కేసీఆర్ వేస్తున్న ప్రశ్నలు ఈ దేశ ప్రజలను , మేధావులను , ప్రగతిశీల మీడియాను ఆలోచనలో పడేస్తున్నయి . భారతదేశం … అమెరికా , చైనా లతో దీటుగా అభివృద్ధి కావడానికి అవసరమైన నిర్ణయాలను వేగంగా ఎందుకు తీసుకోలేకపోతున్నామో అందరమూ ఆలోచించవలసిన అవసరం ఉంది . ఈ దేశ అభివృద్ధికి అనుగుణంగా రాజ్యాంగాన్ని , చట్టాలను ఎందుకు సవరించుకోలేకపోతున్నామో సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కేసీఆర్ సంధిస్తున్న ప్రశ్నలు నిరూపిస్తున్నాయి . ఒకప్పుడు కాంగ్రెస్ , బీజేపీ యేతర ఫ్రంట్ లు కొద్దికాలం అధికారంలో ఉన్నప్పుడు ఇంత విశాల అవగాహన లేదు . ఇప్పుడు కొత్తగా ఆలోచించే నాయకత్వం వచ్చింది . 2009 ఎన్నికల్లో ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్ , బీజేపీ లకు కలిపి దేశంలో వచ్చిన ఓట్ల శాతం 47 . 4 % మాత్రమే . అదే మొత్తం ప్రాంతీయ పార్టీలు , ఇండిపెండెంట్లకు కలిపి వచ్చిన ఓట్లు 52 .6 % . అంటే రెండు జాతీయ పార్టీల కంటే ఎక్కువ బలాన్ని కలిగి ఉన్నయి ప్రాంతీయ పార్టీలు . ఈ ప్రాంతీయ పార్టీల్లో వీలైనన్ని ఎక్కువ పార్టీలు కలిసి ఒక విశాల ప్రత్యామ్నాయ వేదిక ను దేశ అవసరాలకు అనుగుణంగా ఒక పటిష్టమైన , అద్భుతమైన ఎజెండాను రూపొందించగలిగితే ఇంకా ఎక్కువ ప్రజాదరణ పొందే అవకాశం ఉంది . ఈ దేశాన్ని ఒక మంచి దృక్పథంతో నడుపుతూ రాష్ట్రాల హక్కులకు ప్రాణం పొసే అవకాశం ఏర్పడుతుంది . ఆ కోణంలోనే ఒక మంచి ఎజెండాను రూపొందించుకొని ప్రాంతీయ పార్టీలను , ఈ దేశ ప్రజలను ఒప్పించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు . దేశానికి కొత్తగా మార్గదర్శకత్వం వహించే వారికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్దంగానే ఉన్నారు . అయితే వారి ఆలోచనలను అందుకునే విధంగా కేసీఆర్ సారధ్యంలోని ఫెడరల్ ఫ్రంట్ సరైన కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపొందించుకుని ముందుకు సాగితే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది . ఇప్పుడు కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ ఫ్రంట్ కు రెండు రకాల సానుకూలతలు ఉన్నయి .

ఒకటి కాంగ్రెస్ , బీజేపీల పాలనతో 20 ఏళ్లుగా దేశప్రజలతో పాటు ప్రధాన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతీయ పార్టీలు విసిగిపోయి ఉన్నయి . రెండు వీలైనంత ఎక్కువ మంది ప్రాంతీయ పార్టీల రథసారధులను ఎన్నికల ముందుగానే ఒప్పించి ఒక అద్భుతమైన ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్లగలిగితే దేశ వ్యాప్తంగా ప్రజల ఆదరణ లభించే అవకాశం ఉంటుంది . కాంగ్రెస్ , బీజేపీ ల పొత్తుతో పోల్చితే ఏ రకంగా చూసినా ప్రత్యామ్నాయ ఫ్రంట్ వల్లనే దేశానికి , ప్రజలకు , రాష్ట్రాలకు , ప్రాంతీయ పార్టీల ఉనికికి కాస్త మేలు ఎక్కువగానే జరుగుతుందనే వాస్తవాన్ని ప్రాంతీయ పార్టీలు గుర్తించాలి . ఎన్నికల్లో సీట్లు వచ్చిన తర్వాత అని కాకుండా ఈ దేశానికి కాంగ్రెస్ , బీజేపీ యేతర ప్రత్యామ్నాయం ఎందుకు అవసరమో ఎన్నికల ముందే దేశ వ్యాప్తంగా పర్యటించి … కలిసి వచ్చే కూటమి నేతలతో కలిసి … ప్రజలకు అర్ధమయ్యేలా వివరించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు . దేశ ప్రజలను , ప్రాంతీయ పార్టీలను ఆలోచింపజేసే విధంగా ఆయన కార్యాచరణ ఉండబోతున్నది . ఏ రకంగా చూసినా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనా విధానం వల్ల దేశానికి ఎక్కువగా మేలే జరగబోతున్నది అనేది వాస్తవం .

తెలంగాణలో గతంలో ఒక ఇండస్ట్రీ కి అనుమతి రావాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగి అడిగినన్ని డబ్బులిచ్చినా ఏడాది పైనే సమయం పట్టేది . అలాంటి పద్దతిని పూర్తిగా మార్చి వేసి 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చే విధానం రూపొందించారు ముఖ్యమంత్రి కేసీఆర్ . కీలక మైన వ్యవసాయ రంగానికి సాగు నీటి ప్రాజెక్టుల కోసం లక్ష కోట్ల పైనే ఖర్చు పెడుతున్నారు . ఇంకా పాలనా పరమైన అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు . చాలా విషయాల్లో కేంద్రం అనుసరిస్తున్న ధోరణి తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నది . వేగంగా అభివృద్ధి చేసుకోవడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నప్పటికీ అర్ధం పర్ధం లేని కేంద్రం నిబంధనల కారణంగా అడుగు ముందుకు పడకపోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆలోచనలో పడేసింది . తెలంగాణ లాగే ఇతర రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడుతున్నాయని , అభివృద్ధి కి అడ్డు వచ్చే కేంద్రం నిబంధనలకు చరమ గీతం పాడి శాశ్వతంగా రాష్ట్రాలకు కేంద్రం నుండి విముక్తి కల్పించేందుకే కేసీఆర్ ప్రత్యామ్నాయ వేదికను నిర్మించడానికి నడుం బిగించారు . కేంద్రం నిధులు ఖర్చు చేసే విధానంలోనూ ప్రజల కోణంలో సమూల మార్పులు అవసరమని కేసీఆర్ భావిస్తున్నారు . రాబోయే రోజుల్లో కేసీఆర్ లేవనెత్తనున్న ప్రశ్నలు ఫెడరల్ ఫ్రంట్ కు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి . తృతీయ కూటమికి ప్రజల్లో ఆదరణ లభించేలా చేయడానికి అవసరమైన మెటీరియల్ ను కేసీఆర్ సిద్ధం చేసుకుంటున్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat